మమత సర్కారుకు సుప్రీం షాక్.. సింగూర్ భూపంపిణీపై స్టే

నేడు సింగూర్ భూములను రైతులకు పంపిణీ చేయాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో తమకు కేటాయించిన భూములను తిరిగి రైతులకు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయంపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా తొలుత టాటా మోటార్స్ కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది. అయితే హైకోర్టు టాటా మోటార్స్ పిటిషన్‌ను తిరస్కరించడంతో మంగళవారం సంస్థ తరఫున సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. సింగూర్ భూముల వివాదంలో సుప్రీం కోర్టు ఇచ్చి స్టే టాటా మోటార్స్‌కు తాత్కాలికంగా ఊరట కలిగించినట్లయింది.


Click it and Unblock the Notifications








