టాటా మోటార్స్ గ్లోబల్ సీఈఓ ఫోస్టర్ రాజీనామా

కాగా.. టాటా మోటార్స్ లిమిటెడ్ బోర్డుకు కార్ల్-పీటర్ ఫోస్టర్ నాన్-ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా కొనసాగనున్నట్లు టాటా మోటార్స్ పేర్కొంది. ఈ సంధర్భంగా టాటా మోటార్స్ ఛైర్మన్ రతన్ టాటా వ్యాఖ్యానిస్తూ.." ఫోస్టర్ వ్యక్తిగత జీవితాన్ని తాము గౌరవిస్తున్నాము. ఇటీవలి కాలంలో కంపెనీ అభివృద్ధి వెనుక ఆయన కృషి ఎంతో ఉంది. ఫోస్టర్ కేవలం సీఈఓ బాధ్యతలకు మాత్రమే పీటర్ దూరమయ్యాడు, కంపెనీకు కాదు. బోర్డు యొక్క నాన్-ఎగ్జిక్యూటివ్ బోర్డ్ మెంబర్‌గా అతని మాతోనే ఉంటాడ"ని అన్నారు.
టాటా మోటార్స్‌కు సేవలందించండంలో ఫోస్టర్ చేసిన కృషిని రతన్ టాటా గుర్తు చేసి, ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఫోస్టర్ వ్యాఖ్యానిస్తూ.. "నా వ్యక్తిగత కుటుంబ పరిస్థితులు ఒక మంచి సంస్థకు దూరం చేశాయి. ఇందుకు నాకెంతో బాధగా ఉంది. భారత్ కేంద్రంగా పనిచేస్తున్న టాటా మోటార్స్ మరిన్ని దేశాలకు విస్తరిస్తరిస్తుందని నేను భావిస్తున్నాను. ప్రస్తుతం టాటా మోటార్స్‌లో ఒక బోర్డు సభ్యుడిగా గతంలో పనిచేసినట్లుగానే సంస్థ ఉన్నతికి కృషి చేస్తాన" అన్నారు.


Click it and Unblock the Notifications








