మే 2011లో 11 శాతం పెరిగిన టాటా మోటార్స్ గ్లోబల్ సేల్స్

Jaguar Luxury
దేశీయ ప్రముఖ వాహన ఉత్పత్తి సంస్థ టాటా మోటార్స్ మే 2011 నెలకూ అంతర్జాతీయ విక్రయాల వివరాలను వెల్లడించింది. గత నెలలో టాటా మోటార్స్ మే నెల విక్రయాలు 11 శాతం వృద్ధిని సాధించాయి. ముఖ్యంగా వాణిజ్య వాహనాలు మరియు ల్యాండ్ రోవర్ వాహనాల కారణంగా విదేశీ మార్కెట్లో ఈ వృద్ధిని సాధించగలిగింది. మే 2011లో కంపెనీ మొత్తం 88,251 యూనిట్లను విక్రయించగా, అందులో జాగ్వార్ ల్యాండ్ రోవర్ బ్రాండ్ విక్రయాలే 22,296 యూనిట్లు ఉన్నాయి.

గతేడాది ఇదే సమయంతో పోలిస్తే జాగ్వార్ ల్యాండ్ రోవర్ విక్రయాలు 17 శాతం పెరిగినట్లు టాటా మోటార్స్ ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే, కేవలం జాగ్వార్ బ్రాండ్ సెడాన్‌లను పరిశీలిస్తే అవి 18 శాతం క్షీణించి 4,221 యూనిట్లకు పడిపోయాయి. కానీ ల్యాండ్ రోవర్ విక్రయాలు మాత్రం 30 శాతం వృద్ధి చెంది గత నెలలో 18,075 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇదే సమయంలో కేవలం ప్యాసింజర్ వాహనాలు మాత్రమే పరిశీలిస్తే అవి 2 శాతం పెరిగి 44,181 యూనిట్లుగానూ, వాణిజ్య వాహనాలు 20 శాతం పెరిగి 44,070 యూనిట్లుగాను ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, June 15, 2011, 16:57 [IST]
English summary
Tata Motors said its global sales increased by 11% in May 2001 to 88,251 units driven mainly by commercial vehicles and Land Rover. Sales of luxury brands from Jaguar Land Rover were at 22,296 units during May, up 17% from the same month last year, Tata Motors said in a statement.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+