ఏప్రిల్‌లో వాహన ధరలు పెంచనున్న టాటా మోటార్స్

ప్యాసింజర్ కార్ విభాగంలో మోడల్‌ను బట్టి ఇండికా ధరలు రూ. 7,000 నుంచి రూ. 9,000 వరకూ, విస్టా మరియు ఇండిగో సీఎస్ మోడల్ ధరలు రూ. 8,000 నుంచి రూ. 11,000 వరకూ, మాంజా ధరను రూ. 10,000 నుంచి రూ. 15,000 వరకూ పెంచనున్నట్లు టాటా మోటార్స్ వివరించింది.
అలాగే.. యుటిలిటీ వాహన విభాగంలో మోడల్‌ను బట్టి సుమో ధరలు రూ. 13,000 నుంచి రూ. 15,000 వరకూ, గ్రాండే ధరలను రూ. 16,000 నుంచి రూ. 19,000 వరకూ, సఫారీను రూ. 18,000 నుంచి రూ. 29,000, ఆరియా ధరను రూ. 30,000 నుంచి రూ. 36,000, వెంచర్‌ను రూ. 9,000 నుంచి రూ. 12,000 వరకూ పెంచనున్నట్లు కంపెనీ తెలిపింది.
కాగా.. హోండా సియెల్ కార్స్ ఇండియా కూడా ఇటీవలే తమ ఉత్పత్తుల ధరలను 2-3 శాతం పెంచుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తమ లగ్జరీ సెడాన్ అకార్డ్ మినహా మిగిలిన అన్ని మోడళ్లపై ధరలను పెంచనున్నామని, ఇవి ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నాయని కంపెనీ తెలిపింది. ఇదే బాటలో ఇతర ఆటో కంపెనీలు కూడా మార్చి నెలాఖరు నాటికి ధరల పెంపుపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








