ఆర్‌&డి సెంటర్‌ కోసం బ్రిటన్‌లో టాటా మోటార్స్ భారీ పెట్టబడులు

Tata Motors
జాగ్వార్ ల్యాండ్ రోవర్ యజమాని అయిన టాటా మోటార్స్ రానున్న రెండేళ్లలో బ్రిటన్‌లో 50 మిలియన్ పౌండ్ల వ్యయంతో ఓ ఆర్‌&డి (రీసెర్చ్ & డెవలప్‌మెంట్) కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా యూకెలో మ్యానుఫాక్చరింగ్ వెంచర్‌ను నెలకొల్పేందుకు వీలు కలుగుతుందని కంపెనీ విశ్వసిస్తోంది. టాటా మోటార్స్ తాజా వెంచర్ యూరప్ మార్కెట్ల కోసం.. నానో ఫ్లాట్‌ఫామ్‌పై పిక్సెల్ సిటీ కారును అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇటీవల జెనీవాలో జరిగిన 81వ మోటార్ షోలో కంపెనీ ఈ కారును ప్రదర్శనకు ఉంచింది.బ్రిటన్‌లో ఏర్పాటు చేయబోయే టాటా మోటార్స్ యూరోపియన్ టెక్నికల్ సెంటర్ (టిఎమ్ఈటిసి) కోసం కంపెనీ 100 కొత్త ఇంజనీర్లను నియమించుకోనుంది. ఈ నియామకాల ద్వారా తమ వర్క్‌ఫోర్స్‌ను 40 శాతానికి (350 మంది) పెంచుకోవాలని భావిస్తోంది. తక్కువ-కర్బన పరిజ్ఞానంపై (లో-కార్బన్ టెక్నాలజీ) ఈ ఆర్ అండ్ డి కేంద్రం దృష్టి సారిస్తుంది.

యూరోపియన్ డ్రైవర్లను లక్ష్యంగా చేసుకొని టిఎమ్ఈటిసి టాటా విస్టా ఎలక్ట్రిక్ వాహనాన్ని, పిక్సెల్ సిటీ కారును అభివృద్ధి చేసింది. ఈ కేంద్రం యూనివర్సిటీ ఆఫ్ వార్విక్‌కు చెందినది మరియు ఇది డబ్ల్యూఎమ్‌జి (వార్విక్ మ్యానుఫాక్చరింగ్ గ్రూప్‌గా సుపరిచితం)తో భాగస్వామ్యంగా ఏర్పడి కార్యకలాపాలను నిర్వహిస్తుంది. 2005 నుంచి ఇప్పటి వరకూ టాటా ఈ వెంచర్‌పై 85 మిలియన్ పౌండ్లను పెట్టుబడులుగా వెచ్చించింది.

More from DriveSpark

Article Published On: Wednesday, March 30, 2011, 17:57 [IST]
English summary
The rightful owner of Jaguar Land Rover, Tata Motors is investing 50 million Pound for the enactment of R&D in the Midlands for the next two years. The company believes that this would enable the manufacturing venture in the UK.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+