జులై నెలలో 6 శాతం పడిపోయిన టాటా మోటార్స్ సేల్స్

Tata Nano
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ గత నెల అమ్మకాలలో నిరుత్సాహకర ఫలితాలను నమోదు చేసుకుంది. జులై 2011లో కంపెనీ అమ్మకాలు 5.96 శాతం క్షీణించి 63,761 యూనిట్లకు పడిపోయాయి. గతేడాది ఇదే నెలలో కంపెనీ అమ్మకాలు 67,800 యూనిట్లుగా ఉన్నట్ల టాటా మోటార్స్ ప్రకటించింది. దేశీయ మార్కెట్లో వాహనాల అమ్మకాలు 9 శాతం పడిపోయి 57,990 యూనిట్లుగా ఉండగా, ఎగుమతులు మాత్రం 36 శాతం వృద్ధి చెంది 5771 యూనిట్లుగా ఉన్నాయి.

టాటా మోటార్స్ ప్రజల కారు 'టాటా నానో' విక్రయాలు గడచిన జులై నెలలో భారీగా పడిపోయాయి. గతేడాది జులై నెలతో పోలిస్తే టాటా నానో అమ్మకాలు ఏకంగా 64 శాతానికి పడిపోయి 3,260 యూనిట్లుగా నమోదయ్యాయి. కాగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-జులై 2011 కాలం నాటికి కంపెనీ మొత్తం అమ్మకాలు కేవలం 4 శాతం మాత్రమే వృద్ధి చెంది 256,799 యూనిట్లుగా ఉన్నాయని, గతేడాది ఇదే కాలానికి కంపెనీ మొత్తం విక్రయాలు 247,381 యూనిట్లుగా టాటా మోటార్స్ పేర్కొంది.

More from DriveSpark

Article Published On: Tuesday, August 2, 2011, 12:04 [IST]
English summary
Tata Motors, India's second largest carmaker has reported its monthly sales figures for July. The company's total sales stood at 66,761 units marking a six per cent decline from the corresponding period last year. While domestic sales fell by nine per cent to 57,990 units exports grew at an impressive rate of 36 per cent to 5771 units.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+