ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే డీజిల్ వేరియంట్ నానో విడుదల!!

Tata Nano
పెట్రోల్ ధరలు పెరిగాయని చింతిస్తున్నారా... అయితే మీ చింతన కొంత కాలమే.. ఎందుకంటే ప్రపంచంలో అత్యంత చౌవకైన కారు టాటా నానో త్వరలోనే డీజిల్ వేరియంట్‌లో కూడా లభించనుంది. టాటా మోటార్స్ ముద్దుల కారు నానోలో డీజిల్ వేరియంట్ ఈ ఏడాదే మార్కెట్లోకి రానుంది. నానో కారులో కొత్త వేరియంట్ గురించి కంపెనీ ఎలాంటి వివరాలు వెల్లడించనప్పటికీ, ఇందులో డీజిల్ వేరియంట్‌ను ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి తెచ్చేందుకు టాటా సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.

అంతేకాకుండా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే నానో కొత్త వేరియంట్లతో పాటుగా విస్టా రిఫ్రెష్, మాంజా లిమిటెడ్ ఎడిషన్, కొత్త సఫారి, అరియా 2 డబ్ల్యూడీ మోడళ్లను కూడా విడుదల చేయనున్నట్లు కంపెనీ ఇటీవల తమ ప్రజెంటేషన్ సందర్భంగా వెల్లడించింది. ప్రస్తుతం మార్కెట్లో టాటా నానో మూడు వెర్షన్ల పెట్రోల్ వేరియంట్లలో లభిస్తోంది. వీటి ధరలు రూ. 1.41 లక్షల నుంచి రూ. 1.97 లక్షల మధ్యలో ఉన్నాయి.

ఇప్పటికే టాటా మోటార్స్‌తో కలిసి పెట్రోల్ వేరియంట్ ఇంజన్ అభివృద్ధిలో పనిచేస్తున్న ప్రముఖ ఆటొమొబైల్ విడిభాగాల కంపెనీ బాష్, నానో కోసం డీజిల్ ఇంజన్‌ను కూడా తయారు చేస్తున్నామని గత ఏడాది ఢిల్లీలో జరిగిన ఆటో ప్రదర్శనలో వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా.. గత శనివారం టాటా నానో కారును శ్రీలంక మార్కెట్లో కంపెనీ విడుదల చేసింది. ఆదివారం నుంచి బుకింగ్‌లు ప్రారంభించామని శ్రీలంక నానో డీలర్ 'డీజెల్‌ అండ్‌ మోటార్‌ ఇంజనీరింగ్‌ (డిమో)' తెలిపారు.

More from DriveSpark

Article Published On: Monday, May 30, 2011, 11:10 [IST]
English summary
Tata Motors is planing to launch new variants of its budget car Tata Nano during FY12. In a presentation, the company said it will introduce a host of products in FY12 including Nano variants, Vista refresh, Manza limited edition, New Safari, Aria 2WD.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+