డివో, స్టార్‌బస్ ఆల్ట్రా బస్సులను విడుదల చేసిన టాటా

దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ పెరుగుతున్న పట్టణ ప్రజల రవాణా అవసరాలను తీర్చేందుకు గాను రెండు సరికొత్త బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు డివో, స్టార్‌బస్ ఆల్ట్రా మోడళ్లను కంపెనీ దేశీయ విపణిలో విడుదల చేయనుంది. భారత మార్కెట్లో వీటి ధరలు వరుసగా రూ.66 లక్షలు, రూ.15 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉండనున్నాయి.

డివో బస్సు పూర్తిగా విలాసవంతమైనది. పూర్తి ఎయిర్ కండిషనింగ్‌తో కూడిన ఈ లగ్జరీ బస్సును ఇంటర్-సిటీ ప్యాసింజర్ ట్రాన్స్‌పోర్టేషన్, టూరిస్ట్ కార్యకలాపాలం కోసం డిజైన్ చేయబడినది. ఈ బస్సు డిజైన్ కాంపోనెంట్‌ను టాటా మోటార్స్‌కు స్పెయిన్ అనుబంధ సంస్థ హిస్పానో కారెసెరా నుండి సంగ్రహించబడినది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన 'బస్ అండ్ స్పెషల్ వెహికల్ ఎక్స్‌పో'లో కంపెనీ డివో బస్సును ప్రదర్శనకు ఉంచింది.

డివో బస్సులో విభిన్నమైన సీటింగ్ లేఅవుట్స్, ప్రయాణికుడి సౌకర్యానికి తగినట్లుగా అడ్జస్ట్ చేసుకునేందుకు వీలుగా ఏర్పాటు చేసిన సెమీ-స్లీపర్ అండ్ సీటర్ కాన్ఫిగరేషన్, విశాలమైన సీట్లు, హెడ్ ఫ్లాప్స్, ఆర్మ్‌రెస్ట్‌లు వంటి సదుపాయాలు ఉన్నాయి. ఇంకా ఇందులో ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్, రిఫ్రిజరేటర్, మొబైల్ ఛార్జింగ్ పాయింట్స్, డెస్టినేషన్ బోర్డ్, పబ్లిక్ అడ్రెస్ సిస్టమ్ వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి.

డివో బస్సులో 285 హెచ్‌పి కమ్మిన్స్ ఇంజన్‌ను అమర్చారు. అధిక మైలేజ్ కోసం ఇందులో 6-స్పీడ్ ఓవర్‌డ్రైవ్ గేర్‌బాక్స్‌ను ఉపయోగించారు. ఇకపోతే స్టార్‌బస్ ఆల్ట్రా విషయానికి వస్తే, ఇది లగ్జరీ, స్టాండర్డ్, స్కూల్ మరియు డీలక్స్ వేరియంట్లలో లభ్యమవుతుంది. ఇంట్రా-సిటీ ట్రాన్స్‌పోర్టేషన్ కోసం దీనిని రూపొందించడం జరిగింది. ఈ వేరియంట్లు 22-26 సీట్లతో, విభిన్న వీల్‌బేస్ ఆప్షన్‌లతో లభ్యమవుతాయని కంపెనీ పేర్కొంది.

More from DriveSpark

Article Published On: Wednesday, December 21, 2011, 13:29 [IST]
English summary
Tata Motors today launched the Tata Divo, a luxurious long distance inter-city travel bus and the Tata Starbus Ultra, a modern and practical offering for commuting within the city.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+