దేశంలోనే అత్యధిక మైలేజీనిచ్చే ఇండికా ఈవీ2 కారు

ఇండికా ఈవీ2 కారు 1396 సీసీ ఇంజన్‌తో 70 PS @ 4000 RPM పవర్‌ను, 140 NM 1800-3000 RPM టార్క్‌ను కలిగి ఉంటుందని, సీఆర్4 ఇంజన్‌ను వాడటం వల్ల పవర్‌లో 31 శాతం, టార్క్‌లో 65 శాతం, ఇంధన సామర్థ్యంలో 46 శాతం పెరుగుదలను కనబరిచిందని కంపెనీ పేర్కొంది. ఇకపోతే పెట్రోల్ వెర్షన్ ఇండికా ఈవీ2 కారు మల్టీ-పాయింట్ ఫ్యూయెల్ ఇంజెక్షన్ ఇంజన్‌తో లభిస్తుందని, ఈ రెండు వేరియంట్లు కూడా భారత్ స్టేజ్-4 (బిఎస్4) కాలుష్య నియమాలను పాటిస్తుందని టాటా మోటార్స్ తెలిపింది.
పవర్ విండోస్, కీలెస్ ఎంట్రీ, బ్లూటూత్ సౌకర్యం కలిగిన మ్యూజిక్ సిస్టమ్, యూఎస్‌బి పోర్ట్, 4-స్పోక్ స్టీరింగ్ వీల్, టాకో మీటర్, రియర్ పార్సిల్ షెల్ఫ్, 60:40 రియర్ సీటింగ్, ముందు-వెనుక అమర్చిన ఫాగ్ ల్యాంప్స్, ఆకర్షనీయమైన ఇంటీరియర్స్ వంటి అత్యాధునిక ఫీచర్లతో ఇది లభిస్తుంది. ఇంకా.. ఆపిల్ గ్రీన్, నియో ఆరెంజ్, ఆర్క్‌టిక్ సిల్వర్, మింట్ వైట్ అనే నాలుగు రంగులలో ఇండికా ఈవీ2 లభిస్తుంది. ఇక దీని ధర విషయానికి వస్తే.. డీజిల్ వెర్షన్ ధర రూ. 3.95 లక్షల నుంచి రూ. 4.77 లక్షల మధ్య ఉండగా.. పెట్రోల్ వెర్షన్ ధర రూ. 2.95 లక్షల నుంచి రూ. 3.58 లక్షల మధ్య ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీ).


Click it and Unblock the Notifications








