హమ్మయ్య నేపాల్‌కు వచ్చేశాను.. టాటా నానో

భారత్‌లో రూ.1,51,000కు లభ్యమవుతున్న నానో ధర నేపాల్‌లో అంతగా పెరగడానికి కారణం 240 శాతం కస్టమ్స్, ఇన్సూరెన్స్, ఇతర పన్నులే. ఇదిలావుంటే నేపాల్‌లో నానో స్టాండర్డ్ వర్షన్, సిఎక్స్, ఎల్‌ఎక్స్ రకాలు అందుబాటులో ఉన్నాయని టాటా మోటార్స్ అంత ర్జాతీయ వ్యాపార అధిపతి జాని ఉమ్మెన్ తెలిపారు. నానోను సొంతం చేసుకోవాలనుకునే నేపాలీలు ముందుగా రూ.10 వేలు డిపాజిట్ రూపంలో చెల్లించి బుక్ చేసుకోవచ్చన్నారు. అయితే ప్రస్తుతం ఈ బుకింగ్ సౌకర్యం ఖట్మండూలోనే ఉంటుందని, పది రోజుల తర్వాత ఇతర ప్రధాన నగరాలకు అందుబాటులో ఉంటుందని జాని ఉమ్మెన్ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications








