రూ.3.88 లక్షలకే కొత్త టాటా విస్టా: టాటా మోటార్స్

New Tata Vista
భారత ఆటో దిగ్గజం టాటా మోటార్స్ గత నెల దేశీయ విపణిలోకి ఆవిష్కరించిన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు విస్టా రెండు కొత్త వేరియంట్స్ ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ సెగ్మెంట్‌లో వస్తున్న కొత్త విస్టా పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యమవుతుంది.

భారత మార్కెట్లో సఫైర్ పెట్రోల్ వేరియంట్ కొత్త విస్టా ధర రూ. 3.88 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) గానూ మరియు క్వాడ్రాజెట్ డీజిల్ వేరియంట్ కొత్త విస్టా ధర రూ. 4.79 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) గానూ నిర్ణయించినట్లు టాటా మోటార్స్ ఓ ప్రకటనలో పేర్కొంది.

కొత్త డీజిల్ వేరియంట్ విస్టాలో 1.3 లీటర్ కామన్ రైల్ డైరెక్ట్ ఇంజక్షన్ క్వాడ్రాజెట్ డీజిల్ ఇంజన్‌ను మరియు కొత్త పెట్రోల్ వేరియంట్ విస్టాలో 1.4 లీటర్ ఎమ్‌పిఎఫ్ఐ సఫైర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. డీజిల్ విస్టా లీటరుకు 22.3 కి.మీ. మైలేజీని మరియు పెట్రోల్ విస్టా లీటరుకు 16.7 కి.మీ. మైలేజీనిస్తుందని కంపెనీ తెలిపింది.

ఇంకా ఇందులో సరికొత్త క్రోమ్ ఫ్రంట్‌ గ్రిల్‌, మంచి కాంతి కోసం ట్రిపుల్‌ బారల్‌ హెడ్‌ల్యాంప్, అల్లాయ్‌ వీల్స్‌, స్టీరింగ్‌పై ఆడియో కంట్రోల్స్‌, 2-డిఐఎన్‌ మ్యూజిక్‌ సిస్టమ్‌, బ్లూటూత్‌, మిర్రర్‌ అడ్జస్ట్‌ విత్‌ జాయ్‌ స్టిక్‌, డ్రైవర్‌కు అనుగుణంగా మార్చుకునేలా ఏర్పాటు చేసిన టిల్ట్ అడ్జస్టబుల్ స్టీరింగ్‌ ఫీచర్లు కొత్త విస్టా సొంతం.

ఇది ఆరు ఆకర్షనీయమైన రంగులలో ఇది లభ్యమవుతుంది. ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్‌ (ఈబిడి)తో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్), డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్స్, ఇంజన్ ఇమ్మొబిలైజర్, ధృఢమైన కారు బాడీ మరియు రిమోట్ కీలెస్ ఎంట్రీ వంటి భద్రతా ఫీచర్లు కూడా ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Monday, September 12, 2011, 10:42 [IST]
English summary
The country’s largest auto-maker Tata Motors has launched a new version of its Vista model at a starting price of Rs 3.88 lakh (ex-showroom Delhi). The new Vista is powered by a 1.3-litre common rail direct injection Quadrajet diesel engine and a 1.4-litre MPFi Safire petrol engine.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+