హైదరాబాద్‌లో కొత్త విస్టాను విడుదల చేసిన టాటా మోటార్స్

పెట్రోల్ వేరియంట్ విస్టా కారు ధర రూ. 3.89 లక్షలు (ఎక్స్-షోరూమ్ హైదరాబాద్)గా ఉండగా డీజిల్ వేరియంట్ విస్టా కారు ధర రూ. 4.82 లక్షలు (ఎక్స్-షోరూమ్ హైదరాబాద్)గా నిర్ణయించారు. డీజిల్ విస్టా లీటరుకు 22.3 కి.మీ. మైలేజీని మరియు పెట్రోల్ విస్టా లీటరుకు 16.7 కి.మీ. మైలేజీనిస్తుందని కంపెనీ తెలిపింది. సరికొత్త క్రోమ్ ఫ్రంట్ గ్రిల్, ట్రిపుల్ బారల్ హెడ్ పాంప్, అల్లాయ్ వీల్స్, స్టీరింగ్‌పై ఆడియో కంట్రోల్స్, 2-డిఐఎన్ మ్యూజిక్ సిస్టమ్, బ్లూటూత్, మిర్రర్ అడ్జస్ట్ విత్ జాయ్ స్టిక్, డ్రైవర్‌కు అనుగుణంగా మార్చుకునేలా ఏర్పాటు చేసిన టిల్ట్ అడ్జస్టబుల్ స్టీరింగ్ ఫీచర్లు కొత్త విస్టా సొంతం.
సమ్మర్ స్కార్కిల్, పార్కొలెన్ వైట్, ఆర్కిటిక్ సిల్వర్, సై్పస్ రెడ్, బ్రిలియంట్ బ్లూ, కావరెన్ గ్రే అనే ఆరు ఆకర్షనీయమైన రంగులలో ఇది లభ్యమవుతుంది. ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (ఈబిడి)తో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్), డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్స్, ఇంజన్ ఇమ్మొబిలైజర్, ధృఢమైన కారు బాడీ మరియు రిమోట్ కీలెస్ ఎంట్రీ వంటి భద్రతా ఫీచర్లు కూడా కొత్త విస్టాలో ఉన్నాయి.


Click it and Unblock the Notifications








