రాష్ట్ర మార్కెట్లో 'ప్రైమా' ట్రక్కులను విడుదల చేసిన టాటా మోటార్స్

హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రైమా ట్రక్కులను సహాయ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విదేశీ సంస్థ కమ్మిన్స్ సహాయంతో అధునాతన సాంకేతిక నైపుణ్యాన్ని ఉపయోగించి రూపొందించిన ఐఎస్‌బీఈ ఇంజిన్, 280 హార్స్‌పవర్‌ల శక్తిని కలిగి ఉంటుందని, ఇతర వాహనాలతో పోలిస్తే ఇది ఇంజిన్, గేర్‌బాక్స్ వంటి తదితర పరికరాలు మరింత ధృఢంగా ఉంటాయని ఆయన తెలిపారు. వీటి ధరలు రూ. 36 లక్షల నుండి రూ. 38 లక్షల ఉంటాయని ఆయన వివరించారు. భవిష్యత్తులో మరిన్ని ప్రైమా ట్రక్కులను విడుదల చేయాలని కంపెనీ భావిస్తోంది. ప్రస్తుతం విదేశాల్లో ప్రైమా బ్రాండ్ ట్రక్కులకు భారీ ఆదరణ లభిస్తోంది.


Click it and Unblock the Notifications








