గ్రేట్ వాల్‌తో సంబంధాల కోసం జాగ్వార్ ల్యాండ్ రోవర్ చర్చలు

రెండు కంపెనీలు సహకరించుకునేందుకు గల అవకాశాలను పరిశీలిస్తున్నాయని, జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ సీనియర్ ప్రతినిధులు ఈ నెల ఆరంభంలో తమ సంస్థను సందర్శించారని గ్రేట్ వాల్ మోటార్స్ ఎగ్జిక్యూటివ్ ఒకరు వెల్లడించారు. ఈ మేరకు ఇరుపక్షాల మధ్య సంబంధాలు ఇప్పటికే ప్రారంభ దశను దాటాయని, అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఈ చర్చలతో సంబంధం ఉన్న మరో ఉన్నతాధికారి వివరించారు. జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఉన్నతాధికారులు చైనా పర్యటించినప్పుడు వారిని గ్రేట్ వాల్ చైర్మన్ వీ జియాంజున్ కలిశారని ఆయన తెలిపారు.


Click it and Unblock the Notifications








