గ్రేట్‌ వాల్‌తో సంబంధాల కోసం జాగ్వార్ ల్యాండ్ రోవర్ చర్చలు

Tata Logo
భారత ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్‌కు చెందిన లగ్జరీ బ్రాండ్ "జాగ్వార్ ల్యాండ్ రోవర్" చైనాకు చెందిన స్పోర్ట్స్‌ యుటిలిటీ వాహన తయారీ సంస్థ "గ్రేట్‌ వాల్‌ మోటార్ కంపెనీ‌"తో ఓ ఒప్పందం కుదుర్చుకోవాలని భావిస్తోంది. ఈ మేరకు గల సాధ్యాసాధ్యాలను జాగ్వార్‌ అండ్‌ ల్యాండ్‌ రోవర్‌ యూనిట్‌ అధికారులు గ్రేట్ వాల్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.

రెండు కంపెనీలు సహకరించుకునేందుకు గల అవకాశాలను పరిశీలిస్తున్నాయని, జాగ్వార్‌ అండ్‌ ల్యాండ్‌ రోవర్‌ సీనియర్‌ ప్రతినిధులు ఈ నెల ఆరంభంలో తమ సంస్థను సందర్శించారని గ్రేట్ వాల్‌ మోటార్స్ ఎగ్జిక్యూటివ్‌ ఒకరు వెల్లడించారు. ఈ మేరకు ఇరుపక్షాల మధ్య సంబంధాలు ఇప్పటికే ప్రారంభ దశను దాటాయని, అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఈ చర్చలతో సంబంధం ఉన్న మరో ఉన్నతాధికారి వివరించారు. జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ ఉన్నతాధికారులు చైనా పర్యటించినప్పుడు వారిని గ్రేట్‌ వాల్‌ చైర్మన్ వీ జియాంజున్‌ కలిశారని ఆయన తెలిపారు.

Most Read Articles

English summary
India's auto gaint Tata Motors' Jaguar and Land Rover unit is in talks with top Chinese sport utility vehicle maker Great Wall Motor Co about a potential China tie-up.
Story first published: Wednesday, February 23, 2011, 12:53 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X