సెలబ్రేషన్ ఎడిషన్‌ను విడుదల చేయనున్న టాటా మోటార్స్

అయితే, ఇప్పుడు తాజాగా టాటా మోటార్స్ అందిస్తున్న ప్రీమియం సెడాన్ "మాంజా"లో ఓ సరికొత్త సెలబ్రేషన్ ఎడిషన్‌ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ మోడల్ స్పై చిత్రాలు ఇంటర్నెట్‌లో హాట్ సెర్చ్‌గా ఉన్నాయి. ప్రస్తుతం మాంజాలో వస్తున్న టాప్ ఎండ్ వేరియంట్ మాంజా ఎలాన్‌కు ఎగువ ఈ కొత్త సెలబ్రేషన్ ఎడిషన్‌ను టాటా ప్రవేశపెట్టనుంది.
కొత్త మాంజా సెలబ్రేషన్ ఎడిషన్‌లో ప్రస్తుతం ఉన్న ఫీచర్లకు అదనంగా మరికొన్ని ప్రత్యేక ఫీచర్లను టాటా మోటార్స్ జోడించనుంది. కొత్త మాంజా సెలబ్రేషన్ ఎడిషన్ సెడాన్‌లో ఆడియో హెచ్చరికలతో కూడిన రివర్స్ పార్కింగ్ సెన్సార్, ఎబోనీ బ్లాక్ ఇంటీరియర్స్, ఆర్ట్ లెథర్ సీట్స్ ఇందులో ప్రధాన అదనపు ఫీచర్లుగా ఉండే అవకాశం ఉంది.
అలాగే, ప్రస్తుతం ఉన్న మాంజా ఎలాన్ సెడాన్‌లో ఉండే 15 ఇంచ్ అల్లాయ్ వీల్స్, కారు కిటికీలపై క్రోమ్ ఫినిషింగ్, టైరియాన్ వైన్ కలర్, డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్స్‌ను కలిగి ఉండనుంది. అలాగే, కారు వెనుకవైపు బ్యాడ్జ్‌పై ఇండిగో అనే పదాన్ని తొలగించవచ్చని అంచనా. ప్రస్తు పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని మరికొద్ది రోజుల్లో టాటా మోటార్స్ దీన్ని మార్కెట్లోకి విడుదల చేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








