సింగూర్ భూవివాదంపై సుప్రీం కోర్టుకు వెళ్లనున్న టాటా

నేటి నుంచి బెంగాల్ ప్రభుత్వం సింగూర్ భూములను రైతులకు పంపిణీ చేయనుందనే సమాచారంతో దాన్ని నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని టాటా మోటార్స్ కలకత్తా హైకోర్టును కోరింది. అయితే, ఇందుకు సంబంధించి ఏ విధమైన ప్రకటన వెలువడినట్లు పిటిషన్ ద్వారా తమ దృష్టికి రాకపోవడంతో మధ్యంతర ఉత్తర్వులను జారీ చేయలేమని టాటా మోటార్స్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ హైకోర్టు న్యాయమూర్తి సౌమిత్రా పాల్ తీర్పునిచ్చారు. టాటా మోటార్స్ కౌన్సిల్ సమరాదిత్య పాల్ భూమి పంపిణీని ఆపేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ఎక్స్ పార్టీ పిటిషన్ దాఖలు చేశారు. ప్రత్యర్థి పార్టీ కోర్టుకు వెళ్లినందున అది జరగదని పశ్చిమ బెంగాల్ పారిశ్రామికాభివృద్ధి కార్పొరేషన్ సీనియర్ కౌన్సిల్ సకినాథ్ ముఖర్జీ అన్నారు.


Click it and Unblock the Notifications








