విజయవాడకు చేరుకున్న టాటా నానో సూపర్‌డ్రైవ్

Tata Nano
ప్రజల కారు టాటా నానోను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు టాటా మోటార్స్ "నానో సూపర్‌డ్రైవ్" అనే కొత్త ప్రచారాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ ప్రచారంలో భాగంగా నానో తాజాగా చేపట్టిన "నానో సూపర్‌డ్రైవ్ 2" మన విజయవాడకు చేరుకుంది. విజయవాడలో టాటా నానో సూపర్ డ్రైవ్-2 కారవాన్ ర్యాలీకి మంచి స్పందన వచ్చిందని కంపెనీ తెలిపింది. ఈ ర్యాలీలో విజయవాడకు చెందిన పలువురు నానో కార్ల యజమానులు కూడా పాల్గొన్నారని టాటా మోటార్స్ పేర్కొంది.

ఆంధ్ర రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు నానో కారును మరింత చేరువ చేసే ఉద్దేశంతో ఈ ర్యాలీని తలపెట్టినట్లు టాటా మోటార్స్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ సూపర్‌డ్రైవ్ 2 కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దిన రెండు నానో కార్లు విజయవాడ నగర వీధుల్లో సంచరిస్తూ హల్ చల్ చేశాయి. తిరుచిరాపల్లిలో ప్రారంభమైన ఈ ర్యాలీ నిజామాబాద్‌లో ముగుస్తుందని కంపెనీ తెలిపింది. ఈ నెల 16వ తేదీన ముంబై నగరంలో టాటా మోటార్స్ సెకండ్ ఎడిషన్ సూపర్‌డ్రైవ్‌ను ప్రారంభించింది.

గడచిన సంవత్సరం జూన్ నెలలో టాటా 26 రోజుల సుదీర్ఘమైన నానో సూపర్‌డ్రైవ్‌ను నిర్వహించింది. ఈ సూపర్‌డ్రైవ్ 36 నగరాల్లో 15,000 కిలోమీటర్ల మేర సాగింది. కాగా.. ఈ సూపర్‌డ్రైవ్ సీజన్ 2 దాదాపు 28 రోజుల పాటు నిర్వహించాలని కంపెనీ భావిస్తోంది. సూపర్‌డ్రైవ్ 2లో 12 నానో కార్లు పాల్గొని దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తాయి. మార్చి 2009లో విడుదలైనా టాటా నానో భారత మార్కెట్లో ఎన్నో ఒడిదుకులను ఎదుర్కొని మళ్లీ తన యధాస్థానాన్ని దక్కించుకుంది.

ప్రస్తుతం శ్రీలంక మార్కెట్లో కూడా నానో కారు లభ్యమవుతుంది. అంతేకాకుండా.. మరికొద్ది నెలల్లోనే నానో కారులో డీజిల్ వేరియంట్ కూడా లభ్యం కానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. కాబట్టి పెరుగుతున్న ట్రాఫిక్‌ను అలాగే పెరుగుతున్న పెట్రోల్, వడ్డీ రేట్లను బట్టి చూస్తే.. ఈస్ట్ ఆర్ వెస్ట్ నానో ఈజ్ ది బెస్ట్ అనక తప్పదు మరి.

More from DriveSpark

Article Published On: Tuesday, May 31, 2011, 12:09 [IST]
English summary
India's largest vehicle maker Tata Motors, new campaign of its Peoples Car Tata Nano second edition Superdrive has reached to vijayawada. The Nano Superdrive 2 will witness an exciting voyage of 28 days, in which 12 Tata Nanos will traverse the country. In June 2010 the company had organized a 26 day long Nano Superdrive, covering 36 cities and a distance of 15,000 kms.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+