టాటా మోటార్స్ ఆర్థిక ఫలితాలు అదుర్స్: 3 రెట్లు పెరిగిన లాభం

Tata Motors
గడచిన ఆర్థిక సంవత్సరానికి గానూ టాటా మోటార్స్ ఆర్థిక ఫలితాలు అటు మార్కెట్ వర్గాలు, ఇటు కంపెనీ వర్గాల అంచనాలకు మించి నమోదయ్యాయి. మార్చి 31, 2011తో ముగిసిన 2010-11 ఆర్థిక సంవత్సరంలో టాటా మోటార్స్ ఏకీకృత (కన్సాలిడేటెడ్) నికర లాభం నికర మూడు రెట్లు పెరిగి రూ. 9,274 కోట్లుగా నమోదైనట్లు కంపెనీ ప్రకటించింది. 2009-10 ఆర్థిక సంవత్సరంలో ఇది కేవలం రూ. 2,571 కోట్లు మాత్రమే. దేశీయ మార్కెట్‌లో ట్రక్కులు, బస్సుల అమ్మకాలతో పాటు బ్రిటన్ అనుబంధ సంస్థ అయిన జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ యూనిట్‌ విక్రయాలు కూడా పటిష్టంగా ఉండటంతో ఇది సాధ్యమైనట్లు కంపెనీ వివరించింది.

ప్రతికూల మార్కెట్ పరిస్థితుల్లో కూడా కంపెనీ అద్భుతమైన పనితీరుతో మంచి లాభాలను నమోదు చేసిందని, విదేశీ విక్రయాలు, ఉత్పత్తుల ధరల తీరు మెరుగ్గా ఉండటమే ఈ వృద్ధికి కారణమని కంపెనీ సీఎఫ్‌ఓ సి.రామకృష్ణన్ తెలిపారు. ఇప్పటికే పెరిగిన ఉన్న నిత్యావసర/ముడి సరుకుల ధరలు కంపెనీ ముందున్న సవాళ్లని ఆయన తెలిపారు. కాగా, గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం ఆదాయం గతేడాదితో పోలిస్తే 33.1 శాతం వృద్ధి చెంది రూ. 92,519 నుంచి రూ. 1,23,133 కోట్లకు పెరిగింది. ఇదే సమయంలో టాటా మోటార్స్ ప్రపంచవ్యాప్తంగా మొత్తం విక్రయాలు 10,80,994 యూనిట్లకు చేరుకున్నాయి.

More from DriveSpark

Article Published On: Friday, May 27, 2011, 10:49 [IST]
English summary
The Tata Motors Group's global wholesale volumes for FY 2010-11, including Jaguar Land Rover, stood at 1,080,994 units, representing a growth of 24.2% as compared to the previous year. Global sales of all commercial vehicles were at 512,731 units, while global sales of all passenger vehicles were at 568,263 units.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+