దక్షిణాఫ్రికా ప్లాంటులో ఉత్పత్తిని ప్రారంభించిన టాటా మోటార్స్

ఇంకా ఈ కార్యక్రమంలో టాటా ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్ నోయల్ ఎన్. టాటా, టాటా మోటార్స్ గ్రూప్ సీఈఓ మరియు మేనేజింగ్ డైరెక్టర్ కార్ల్-పీటర్ ఫ్రోస్టర్, టాటా ఆఫ్రికా మేనేజింగ్ డైరెక్టర్ రమణ్ ధావన్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్లాంటు కోసం 110 మిలియన్లను వెచ్చించినట్లు కంపెనీ తెలిపింది.
ఈ ప్లాంటులో 4 టన్నుల నుంచి 50 టన్నుల వరకూ బరువైన వాహనాలను ఎస్‌కెడి (సెమీ నాక్‌డ్ డౌన్) కిట్‌లుగా దిగుమతి చేసుకొని అసెంబ్లింగ్ చేయనుంది. ప్రారంభ దశలో భాగంగా ప్రస్తుతం ఈ ప్లాంటులో ఎల్‌పిటి 813, ఎల్‌పిటి 1518 వాహనాలను తయారు చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ రెండు మోడళ్లు కూడా దక్షిణాఫ్రికాలో అత్యంత ప్రాచుర్యం పొందినవే. ఈ ప్లాంటు వార్షిక సామర్థ్యం 3,650 వాహనాలు.


Click it and Unblock the Notifications








