నానో కోసం ప్రత్యేక షోరూమ్‌లను ఏర్పాటు చేయనున్న టాటా

Tata Nano
టాటా మోటార్స్ 'ప్రజల కారు' టాటా నానో విడుదలై రెండేళ్లు గడుస్తున్నా విక్రయాలు అంతంత మాత్రంగానే ఉండటంతో కంపెనీ మార్కెటింగ్ సామర్థ్యాన్ని పెంచుకునే అంశంపై దృష్టి సారిస్తోంది. దేశవ్యాప్తంగా, మరీ ముఖ్యంగా పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఈ బుజ్జి కారు అందుబాటులోకి వచ్చేలా కంపెనీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. టాటా నానో విక్రయాలకు మరింత ఊతమిచ్చేందుకు కేవలం నానో కార్ల కోసమే ప్రత్యేకంగా 300 షోరూమ్‌లను ఏర్పాటు చేయాలని టాటా మోటార్స్ భావిస్తోంది.

మరిన్ని ప్రదేశాల్లో తాము నానో కారును ప్రవేశపెట్టాలని భావిస్తున్నామని, గ్రామీణ ప్రాంతాలు మరియు చిన్న పట్టణాల్లో కొత్తగా 300 అవుట్‌లెట్లను ప్రత్యేకించి నానో కార్లను మాత్రమే విక్రయించేందుకు ఏర్పాటు చేయనున్నామని కంపెనీ అధికార ప్రతినిధి తెలిపారు. ప్రస్తుతం 600లకు పైగా టాటా ప్యాసింజర్ వాహనాల అవుట్‌లెట్లలో అలాగే, 200లకు పైగా యాక్సెస్ పాయింట్లలో నానో కారు లభ్యమవుతున్నట్లు ఆయన వెల్లడించారు.

కేవలం ఒక్కసారి మాక్రమే, గత ఏప్రిల్ నెలలో గరిష్టంగా 10,012 యూనిట్లు అమ్ముడైన టాటా నానో గత నెలలో కేవలం 5,451 కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి. కాగా.. టాటా నానో ఇప్పటికే, శ్రీలంక మరియు నేపాల్ వంటి పొరుగు దేశాల్లో కూడా లభ్యమవుతుండగా.. త్వరలోనే మరిన్ని విదేశీ మార్కెట్లలో నానో కారును ప్రవేశపెట్టేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది. ప్రస్తుతం మార్కెట్ పరిస్థితులు అనుకూలంగా లేవని, సాధారణంగా వర్షాకాలంలో గిరాకీ తక్కువగా ఉంటుందని, దీనికి తోడుగా పెరిగిన వడ్డీ రేట్లు, ఇంధన ధరలతో విక్రయాలు మరింత మందగించయాని, త్వరలోనే ఇవి సాధారణ స్థాయికి చేరుకుంటాయని ఆయన చెప్పారు.

More from DriveSpark

Article Published On: Friday, July 8, 2011, 11:22 [IST]
English summary
Indian auto major Tata Motors is planning to launch 300 new dedicated sales outlets in 2011-12 for their people's car Tata Nano.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+