కేవలం నానో కార్ల కోసమ ప్రత్యేక షోరూమ్‌లు: టాటా మోటార్స్

చిన్న పట్టణాల్లో నానో కార్ల కోసం ప్రత్యేకంగా స్టాండ్అలోన్ స్టోర్లను ప్రారంభించేందుకు టాటా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ విధంగా స్టాండ్అలోన్ స్టోర్ల ద్వారా టాటా అందిస్తున్న మినీ ట్రక్ ఏస్ విజయవంతం కావడంతో నానో కారును ఇలా విక్రయించాలని కంపెనీ భావిస్తోంది. దేశవ్యాప్తంగా దాదాపు 600 స్టాండ్అలోన్ స్టోర్ల ద్వారా ఏస్ అమ్ముడైంది. ప్రస్తుతం నానో దేశవ్యాప్తంగా టాటా మోటార్స్‌కు ఉన్న 617 రెగ్యులర్ అవుట్‌లెట్ల ద్వారా అందుబాటులో ఉంది. అలాగే... భారత్‌లోని చిన్న పట్టణాల్లో కేవలం ఏస్‌ను విక్రయించే షోరూమ్‌లు 600 ఉన్నాయి.
టాటా నానోను 617 రెగ్యులర్ టాటా అవుట్‌లెట్లతో పాటు 210 యాక్సెస్ పాయింట్ల ద్వారాను, అలాగే 151 టాటా అధీకృత సర్వీస్ సెంటర్ల ద్వారా కూడా అందుబాటులో ఉంది. అంతే కాకుండా.. ఇటీవలే ఈ చిన్నకారును బిగ్ బజార్ రీటైల్ మాల్స్‌లలో కూడా విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా టాటా వెస్ట్‌సైడ్ రీటైల్ మాల్స్‌లలో కూడా నానో కారును బుక్ చేసుకునే సదుపాయాన్ని కంపెనీ కల్పిస్తుంది. డిసెంబర్ 2010లో నానో 5,784 కార్లు అమ్ముడు కాగా.. జనవరి 2011లో 6,703 యూనిట్లకు, అలాగే ఫిబ్రవరిలో 8,262 యూనిట్లకు, మార్చిలో 8,707 యూనిట్లకు పెరిగాయి.


Click it and Unblock the Notifications








