టాటా మోటార్స్ క్యూ3 నికరలాభం రూ. 410 కోట్లు

TATA
దేశీయ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ ఈ ఆర్థిక సంవత్సరం తృతీయ త్రైమాసికంలో నిరాశజనక ఫలితాలను ప్రకటిచింది. డిసెంబర్ 31, 2010తో ముగిసిన మూడో త్రైమాసికంలో కంపెనీ నికరలాభం కేవలం 2.46 శాతం మాత్రమే వృద్ధిని సాధించి రూ. 410 కోట్లుగా నమోదయినట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో కంపెనీ నికరలాభం రూ. 400.14 కోట్లుగా ఉంది.

అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో టాటా మోటార్స్ నికర అమ్మకాలు 11,458.95 కోట్లకు పెరిగాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర విక్రయాలు రూ. 8,923.99 కోట్లుగా ఉన్నాయి. ఈ సమయంలో ముడిసరుకులు, ఉపకరణాల ఖర్చు రూ. 4,975.29 కోట్ల నుంచి రూ. 6,498.97 కోట్లకు పెరిగింది. అలాగే ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో కంపెనీ వాహన విక్రయాల సంఖ్య కూడా 1,65,413 యూనిట్ల నుండి 1,94,085 యూనిట్లకు పెరిగింది.

More from DriveSpark

Article Published On: Friday, February 11, 2011, 17:49 [IST]
English summary
India's auto major Tata Motors today reported a 2.46 per cent increase in its net profit for the third quarter ended December, 31 2010 at Rs 410 crore againest Rs 400.14 crore in the same period of the last fiscal.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+