పెద్దగా మార్పు లేని టాటా మోటార్స్ క్యూ1 లాభాలు

కాగా.. ఈ త్రైమాసికంలో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర అమ్మకాలు మాత్రం 23 శాతం వృద్ధి చెంది రూ. 33,392 కోట్లుగా ఉన్నాయి. గతేడాది ఇదే సమయంలో కంపెనీ అమ్మకాలు రూ. 27,055 కోట్లుగా ఉన్నాయి. ఇకపోత.. క్యూ1లో టాటా మోటార్స్‌కు చెందిన బ్రిటీష్ యూనిట్, ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జెఎల్ఆర్) అమ్మకాలు మాత్రం 28.4 శాతం వృద్ధి చెంది రూ. 19,776 కోట్లకు పెరిగాయి. గతేడాది ఇదే కాలానికి జెఎల్ఆర్ అమ్మకాలు రూ. 15,396 కోట్లుగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications








