జనవరి అంతర్జాతీయ విక్రయాలలో కోలుకున్న టాటా మోటార్స్

Tata Motors
దేశీయ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటర్స్‌ జనవరి నెల అంతర్జాతీయ విక్రయాలు స్వల్పంగా కోలుకొని 16 శాతానికి పెరిగాయి. గతేడాది జనవరి విక్రయాలతో పోలిస్తే.. ఈ ఏడాది జనవరిలో విక్రయాలు 98,998లకు చేరుకున్నట్లు కంపెనీ పేర్కొంది. ప్యాసింజర్, వాణిజ్య వాహనాలకు మంచి డిమాండ్‌తో ఉండటంతో ఈ వృద్ధి సాధ్యమైందని సంస్థ తెలిపింది.

మొత్తం విక్రయాలలో లగ్జరీబ్రాండ్‌ కారు అయిన "జాగుర్‌ లాండ్‌ రోవర్‌" విక్రయాలు జనవరిలో 20,377 పెరిగి, గతేడాదితో పోలిస్తే 25 శాతం వృద్ధిని సాధించాయని టాటా మోటర్స్‌ తెలిపింది. అలాగే.. జనవరి నెలలో లగ్జరీ సెడాన్ జాగుర్‌ విక్రయాలు 3 శాతం పెరిగి 3,056 యూనిట్లకు చేరుకోగా.. లాండ్‌ రోవర్‌ విక్రయాలు 30 శాతం పెరిగి 17,321 యూనిట్లకు పెరిగాయి.

ఇక ప్యాసింజర్‌ వాహనాల విషయానికి వస్తే.. జనవరి, 2011లో ఇవి 17 శాతం వృద్ధి చెంది 53,183 యూనిట్లకు పెరిగాయి. వాణిజ్య వాహన విక్రయాలు 14 శాతం పెరిగి 45,815 యూనిట్లకు చేరుకున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జనవరి కాలానికి గానూ మొత్తం విక్రయాలు 17 శాతం పెరిగి 8,68,583 యూనిట్లకు చేరుకున్నట్లు కంపెనీ వివరించింది.

More from DriveSpark

Article Published On: Wednesday, February 16, 2011, 16:00 [IST]
English summary
There has been a marginal rise in the sale volume for Tata Motors globally in January with 98998 units. The feat was possible due to the rise in demand for the vehicles of passenger and commercial sectors. This sale indicated a rise of 16% from the one achieved in the corresponding period of 2010.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+