వాణిజ్య వాహనాల షోరూమ్‌లలో టాటా కార్ల అమ్మకాలు!

Tata Nano
మార్కెటింగ్ మరియు పంపిణీ వ్యవస్థను మరింత పటిష్టం చేసుకునేందుకు దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ తన వాణిజ్య వాహనాల నెట్‌వర్క్‌ను ప్యాసింజర్ వాహనాలను విక్రయించేకు ఉపయోగించుకోనుంది. వాణిజ్య వాహనాల తయారీలోనూ అగ్రగామిగా ఉన్న టాటా మోటార్స్ ప్రస్తుతం ప్యాసింజర్ కార్ల కోసం అలాగే, వాణిజ్య వాహనాల కోసం వేరు వేరుగా షోరూమ్/డీలర్‌షిప్ కేంద్రాలను నిర్వహిస్తున్నసంగతి తెలిసిందే.

అయితే, దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో పోటీ పెరుగుతుండటం, చిన్న నగరాలు. పట్టణాల్లో టాటా ప్యాసింజర్ కార్ల షోరూమ్‌లు లేకపోవటం వంటి వివిధ కారణాలను దృష్టిలో ఉంచుకొని కంపెనీ ఈ ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా టాటా మోటార్స్ వాణిజ్య వాహనాలను విక్రయించే షోరూమ్‌లలో ప్యాసింజర్ వాహనాలను కూడా కంపెనీ విక్రయించనుంది. ఇదేవిధంగా, ప్యాసింజర్ వాహనాలను విక్రయించే షోరూమ్‌లలో కూడా వాణిజ్య వాహనాలను విక్రయించాలని కంపెనీ నిర్ణయించింది.

వాణిజ్య వాహన షోరూమ్‌లను ముఖ్యంగా గ్రామీన ప్రాంతాలాను దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేస్తే, ప్యాసింజర్ వాహన షోరూమ్‌లను నగరాలు, పట్టణాలను దృష్టిలో ఉంచుకొని కంపెనీ ఏర్పాటు చేయడం జరిగింది. టాటా మోటార్స్ కొత్త ప్రణాళికతో ఇక్కడి వాహనాలు అక్కడ, అక్కడి వాహనాలు ఇక్కడ లభ్యమయ్యే అవకాశం ఏర్పడనుంది. అంటే ఇకపై టాటా వాణిజ్య వాహన షోరూమ్‌లలో ఓ పెద్ద ట్రక్కు పక్కన ఓ చిన్న కారు నానో కూడా దర్శనమివ్వబోతుందన్నమాట.

ఈ ప్రణాళిక వల్ల టాటా మోటార్స్ ఎలాంటి ఖర్చు లేకుండానే షోరూమ్‌లు/డీలర్‌షిప్‌ల సంఖ్య పెరిగినట్లు అతుంది. ప్రస్తుతం టాటా మోటార్స్‌కు 254 ప్యాసింజర్ కార్ షోరూమ్‌లు మరియు 1,000కు పైగా వాణిజ్య వాహన షోరూమ్‌లు ఉన్నాయి. అలాగే కొన్ని షోరూమ్‌లు కేవలం 'టాటా ఏస్' చిన్న ట్రక్‌లో ప్రత్యేకమైన షోరూమ్‌లు కూడా ఉన్నాయి. ఈ ప్రణాళిక గనుక అమలు జరిగినట్లుయితే దేశవ్యాప్తంగా ఎక్కడపడితే అక్కడ టాటా మోటార్స్ కార్లు అందుబాటులోకి రానున్నయి. అయితే, ఈ విషయాన్ని మాత్రం టాటా మోటార్స్ అధికారికంగా ధృవీకరించడం లేదు.

More from DriveSpark

Article Published On: Thursday, July 7, 2011, 15:45 [IST]
English summary
Tata Motors has embarked upon anew marketing strategy through which it is aiming to boost the sales of its passenger vehicles as well as commercial vehicles. According to this strategy Tata Motors' cars will be available at its commercial vehicle showrooms and vice versa.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+