నాలుగు లక్షలకు పైగా ఇండిగో సెడాన్‌లను విక్రయించిన టాటా

Tata Manza Sedan
గత 2002లో భారత రోడ్లపైకి ప్రవేశించిన 'ఇండిగో' సెడాన్ కారు ఇప్పటి వరకూ నాలుగు లక్షలకు పైగా కార్లు అమ్ముడయ్యి టాటా మోటార్స్ చరిత్రలో మరో అరుదైన మైలురాయిని నమోదు చేసింది. సరసమైన ధర, అధిక స్థలం, ఉత్తమ మైలేజ్ వంటి ఫీచర్ల కారణంగా ఈ సెడాన్ ఇంతటి వృద్ధిని సాధించగలిగింది. ఈ ఏడాది జూన్ నెల ఆరంభం నాటికి టాటా మోటార్స్ మొత్తం 4,00,000 ఇండిగో సెడాన్ కార్లను విక్రయించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కంపెనీ కొన్ని ప్రత్యేక ఆఫర్లను కూడా ప్రకటిస్తోంది.

2002 నుంచి ఇప్పటి వరకూ ఇండిగో బ్రాండ్‌లో.. టాటా ఇండిగో, టాటా ఇండిగో మరీనా, టాటా ఇండిగో ఎక్స్ఎల్, టాటా ఇండిగో సిఎస్, టాటా ఇండిగో మాంజా, టాటా ఇండిగో మాంజా ఎలాన్ వంటి చాలా వేరియంట్లు మార్కెట్లోకి వచ్చాయి. అధిక మైలేజ్ మరియు వెనుక సీట్లలో అధిక లెగ్ స్పేస్ ఉండటం వల్ల ఈ కారుకు మంచి ప్రజాదరణ లభించింది. ఈ కారణం వల్లనే నగరాలు/పట్టణాల్లో ఎక్కువ సంఖ్యలో ఈ కార్లను క్యాబ్ సర్వీసెస్ మరియు ప్రొఫెషనల్ టాక్సీలుగా ఉపయోగించడం జరుగుతుంది.

ఐదు విభిన్న రంగుల్లో ఈ కారు లభిస్తుంది. సీనా గోల్డ్, మోనార్చ్ రెడ్, జెట్ సిల్వర్, డ్యూ వైట్ వంటి నాలుగు రంగుల్లో సాధారణ వేరియంట్లు లభిస్తుండగా, ట్రైయాన్ వైన్ కలర్ ఇండిగో సెడాన్ టాప్ ఎండ్ ట్రిమ్-ఎలాన్‌లో మాత్రమే లభిస్తుంది. వివిధ ఇంజన్ వేరియంట్లలో లభించే ఇండిగో సెడాన్ కారు ధరలు (ఎక్స్-షోరూమ్ హైదరాబాద్) కింది విధంగా ఉన్నాయి.

QUADRAJET90 BS III - AQUA Rs. 585,188.00
QUADRAJET90 BS III - AURA Rs. 628,998.00
QUADRAJET90 BS III - AURA (ABS) Rs. 672,149.00

SAFIRE90 BS IV - AQUA Rs. 532,922.00
SAFIRE90 BS IV - AURA Rs. 568,104.00
SAFIRE90 BS IV - AURA (ABS) Rs. 601,328.00
SAFIRE90 BS IV - ELAN Rs. 676,266.00

QUADRAJET90 BS IV - AQUA Rs. 611,303.00
QUADRAJET90 BS IV - AURA Rs. 655,114.00
QUADRAJET90 BS IV - AURA (ABS) Rs. 698,837.00
QUADRAJET90 BS IV - ELAN Rs. 762,827.00

More from DriveSpark

Article Published On: Monday, June 20, 2011, 15:01 [IST]
English summary
India's leading car maker Tata Motors have sold over 4 Lakh sedans in India since the year 2002 in which it launched Tata Indigo- India’s first ever Indigenous Sedan of that time.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+