దక్షిణాఫ్రికాలో టాటా మోటార్స్ అసెంబ్లింగ్ ప్లాంట్!

కాగా.. ఇప్పటికే టాటా మోటార్స్ దక్షిణాఫ్రికాలో ప్యాసింజర్ మరియు వాణిజ్య వాహనాలను విక్రయిస్తోంది. అయితే వీటిని భారత్‌ను ఎగుమతుల రూపంలో మాత్రమే అందిస్తోంది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాలో వాహనాలను అసెంబ్లింగ్ చేయాలనే ఉద్దేశంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. థాయిలాండ్, బంగ్లాదేశ్‌లలో టాటా మోటార్స్ ఇప్పటికే ట్రక్కు అసెంబ్లింగ్ ప్లాంట్లను కలిగి ఉంది. దక్షిణాఫ్రికాలోని ఉన్న జపాన్ ఆటో దిగ్గజం నిస్సాన్‌కు చెందిన సదుపాయాలను ఉపయోగించునేందుకు వీలుగా నిస్సాన్ సంస్థలో వాటాలను టాటా మోటార్స్ కొనుగోలు చేసినట్లు కంపెనీ దక్షిణాఫ్రికా విభాగం తెలిపింది. ఇంకా అక్కడ ఓ బస్సులను తయారీ యూనిట్‌ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు టాటా పేర్కొంది.


Click it and Unblock the Notifications








