ఇండోనేషియాలో నానో కార్ల ఉత్పత్తి: టాటామోటార్స్

Tata Nano
కౌలాలంపూర్: ధాయ్‌లాండ్‌లో తలపెట్టిన తమ విస్తరణ ప్రాజెక్టులకు స్వస్తిపలికిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ టాటామోటార్స్, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇండొనేషియాలో ప్రవేశించేందుకు సన్నద్ధం అవుతోంది. ఇండొనేషియాలో తమ నానోకార్లను తయారుచేసేందుకు ఆ దేశానికి చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీతో టాటామోటార్స్ చర్చలు జరుపుతోంది. నానో కార్ల ఉత్పత్తికి థాయ్‌లాండ్ కన్నా ఇండొనేషియా మెరుగైన ప్రదేశమని టాటాలు భావిస్తున్నట్లు బాంకాక్ పోస్ట్ పత్రిక సోమవారం తెలియజేసింది. టాటామోటార్స్ ఇక్కడ సముట్ ప్రకనిన్‌లోని తమ ఫ్యాక్టరీలో గత రెండేళ్లుగా జెనోన్, ఏస్ లైట్ ట్రక్కుల తయారీ జరుపుతోంది.

అందువల్ల ఇక్కడే నానోల తయారీ చేపట్టేందుకు సంస్థ సన్నాహాలు చేస్తోందని పత్రిక పేర్కొంది. దీనికితోడు ఇండొనేషియా ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలు కల్పిస్తున్నందున టాటామోటార్స్ తమ థాయ్‌లాండ్ విస్తరణ ప్రాజెక్టులను మానుకున్నట్లుగా ఈపత్రిక వెల్లడించింది. అలాగే తాయ్‌లాండ్‌లోని రాజకీయ అనిశ్చితి, స్థానిక ఆటోమొబైల్ పన్నుల విధారం నిరుత్సాహకరంగా ఉండటం కూడా టాటామోటార్స్ తమ ప్రణాళిక మార్చుకునేందుకు కారణాలుగా బాంకాక్‌పోస్ట్ పత్రిక పేర్కొంది. టాటామోటార్స్ ప్రస్తుతం ఇండొనేషియాలోని ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ పిటి అస్ట్రా ఇంటర్నేషనల్‌తో నానోకార్ల తయారీకి సంబంధించి చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

More from DriveSpark

Article Published On: Tuesday, July 12, 2011, 16:27 [IST]
English summary
Leading Indian carmaker Tata Motors has decided to build its Nano small car in Indonesia. Tata Motors had initially planned to expand its commercial vehicle manufacturing plant in Thailand to build the Nano. However the Indian auto major decided to move its Nano production to Indonesia after the country offered better incentives than Thailand.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+