2020 నాటికి మరింత మెచ్యూర్‌గా టాటా మోటార్స్: రతన్ టాటా

Ratan Tata
టాటా గ్రూపుకు చెందిన ఆటోమొబైల్ విభాగం టాటా మోటార్స్ 2020 సంవత్సరం నాటికి మరింత పరిపక్వత (మెచ్యూర్) చెందుతుందని ఆ సంస్థ అధినేత రతన్ టాటా చెప్పారు. ప్రముఖ మార్కెట్ పరిశోధన సంస్థ జెడి పవర్‌ భారత ఆటోమొబైల్ పరిశ్రమపై రూపొందించిన ఓ నివేదికకు గానూ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రతన్ టాటా మాట్లాడుతూ.. 2020 నాటికి టాటా మోటార్స్ మరింత విశ్వసనీయమైన మరియు సమవర్థవంతమైన ఉత్పత్తులను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందిస్తుందని తెలిపారు.

రానున్న పదేళ్లలో టాటా మోటార్స్ ప్రపంచ స్థాయి (వరల్డ్ క్లాస్) బ్రాండ్‌గా ఎదుగుతుందని, తమ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఉత్పత్తులను అందిస్తుందని ఆయన అన్నారు. అధిక ఇన్‌పుట్ ధరల కారణంగా హై క్లాస్ టెక్నాలజీని అభివృద్ధి చేయడంలో కంపెనీ సమస్యలు ఎదుర్కుంటుందని, అలాగే, భారత్‌లోని లభించని ఆటోమోటివ్ ట్రాన్సిమిషన్స్ వంటి కొన్ని కీలక విడిభాగాలపై అధిక దిగుమతి సుంఖాలు కూడా కంపెనీపై ఆర్థికంగా ప్రభావాన్ని చూపుతున్నాయని ఆయన తెలిపారు.

కాబట్టి ఇలాంటి విడిభాగాలను దేశీయంగానే అందుబాటులో ఉండేలా సొంతంగా ఇక్కడే అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని రతన్ టాటా అభిప్రాయపడ్డారు. మరో పదేళ్లలో తమ కంపెనీ మరిన్ని నాణ్యమైన ఉత్పత్తులు, కొత్త సాంకేతిక పరిజ్ఞానాలతో వినియోగదారుల అవసరాలకు సరిపోయే విధంగా ఉత్పత్తులను అందించగలదని టాటా ఆశాభావం వ్యక్తం చేశారు. టాటా మోటార్స్ అభివృద్ధిలో బ్రిటీష్ అనుబంధ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) పాత్ర ఉంటుందా అన్ని ప్రశ్నకు టాటా సమాధానమిస్తూ.. ఇంజనీరింగ్ మరియు డెవలప్‌మెంట్ ఏరియాల్లో ఈ రెండు సంస్థల మధ్య గొప్ప సయోధ్య ఉండే అవకాశం ఉందని చెప్పారు.

More from DriveSpark

Article Published On: Tuesday, June 21, 2011, 15:20 [IST]
English summary
The chief of the Tata group of companies Ratan Tata expects Tata's automobile arm, Tata Motors to become a much more mature brand by the year 2020 and produce products which will be more reliable and efficient in line with international standards.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+