టాటా మోటార్స్ గ్లోబల్ సేల్స్ ఎఫెక్ట్..: షేర్లు ఢమాల్..

Tata Shares Fall
టాటా మోటార్స్ అంతర్జాతీయ అమ్మకాలు తగ్గాయని ప్రకటిచడంతో ఉదయం ట్రేడింగ్ సమయంలో కంపెనీ షేర్లు ఒక్కసారిగా ఏడాది కనిష్టానికి పడిపోయాయి దాదాపు 3 శాతం తగ్గాయి. బిఎస్ఈ (బాంబే స్టాక్ ఎక్సేంజ్)లో మార్నింగ్ ట్రేడ్‌లో టాటా మోటార్స్ షేర్లు 2.71 శాతం క్షీణించి 53-వారాల కనిష్టానికి పడిపోయాయి రూ. 780 వద్ద కొనసాగాయి. ఇదే విధంగా ఎన్ఎస్ఈ (నేషనల్ స్టాక్ ఎక్సేంజ్)లో కూడా స్టాక్స్ 2.70 శాతానికి క్షీణించి ఒక ఏడాది కనిష్టానికి పడిపోయి రూ. 779.85ను తాకాయి.

మంగళవారం సాయంత్రం టాటా మోటార్స్ తన జులై నెల అంతర్జాతీయ అమ్మకాల వివరాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. జులై 2011లో కంపెనీ విదేశీ విక్రయాలు 6 శాతం క్షీణించి మొత్తం అమ్మకాలు (జాగ్వార్ ల్యాండ్ రోవర్ అమ్మకాలతో కలిపి) 85,392 యూనిట్లుగా నమోదయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై నాటికి కంపెనీ మొత్తం విదేశీ విక్రయాలు 350,565 యూనిట్లుగా ఉన్నాయి. జులై నెలలో అన్ని గ్లోబల్ ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 24 శాతం తగ్గగా, గ్లోబల్ వాణిజ్య వాహనాల అమ్మకాలు మాత్రం 16 శాతం పెరిగినట్లు టాటా మోటార్స్ ప్రకటించింది.

More from DriveSpark

Article Published On: Wednesday, August 17, 2011, 12:26 [IST]
English summary
Shares of Tata Motors dropped by nearly 3 per cent to hit a one-year low on the bourses in morning trade today after the company’s global sales declined by 6 per cent in July vis-a-vis the same month last year.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+