దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ భారత అతిపెద్ద బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఇండియాతో చేతులు కలిపింది. డీలర్లకు రుణాలు ఇప్పించేందుకు గానూ ఎస్‌బీఐతో ఓ ఒప్పందం కుదుర్చుకున్నట్లు టాటా మోటార్స్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇక నుండి తమ డీలర్లకు కావాల్సిన మూలధనాన్ని ఎస్‌బీఐ ద్వారా పొందవచ్చునని కంపంనీ తెలిపింది. ప్యాసింజర్, వాణిజ్య వాహనాలకు బ్యాంకు రుణాలు మంజూరు చేస్తుందని టాటా మోటార్స్ పేర్కొంది. ఎస్‌బీఐ రుణ సహకారంతో రీటెయిల్ రంగంలో మరింత అభివృద్ధిని సాధించేందుకు అవకాశం ఏర్పడిందనట్లైందని టాటా మోటర్స్ తెలిపింది.