టాటా మోటార్స్ నుంచి కొత్త ఇండికా వేరియంట్ ఈ-జెటా

వి2 జెటాతో పోలిస్తే.. ఈ-జెటా ఇంటీరియర్స్ మరియు ఎక్స్‌టీరియర్స్‌లో అనేక మార్పులు ఉండబోతున్నాయి. మేజర్ మార్పుగా బాడీ ఎక్స్‌టీరియర్ కలర్, డోర్ హ్యాండిల్స్, బంపర్స్, కొత్తగా డిజైన్ చేసిన ఫ్రంట్ గ్రిల్, కొత్త అల్లాయ్ వీల్స్ వంటి అనేక ఫీచర్లతో ఇది మార్కెట్లోకి రానుంది. అంతేకాకుండా కొత్త ఈ-జెటా కారు మింట్ వైట్, యాపిల్ గ్రీన్, ఆర్కిటిక్ సిల్వర్, నియో ఆరెంజ్ వంటి ఆకర్షనీయమైన రంగుల్లో ఇది లభ్యం కానుంది.
ముందు మరియు వెనుక వైపున ఉండే ఫాగ్ ల్యాంప్స్, సెంట్రల్ లాకింగ్, చైల్డ్ సేఫ్టీ లాక్, బ్లూటూత్ కనెక్టివిటీ, పవర్ విండోస్, కొలాప్సిబుల్ స్టీరింగ్, యూఎస్‌బి, యూఎస్‌బి మరియు ఏయూఎక్స్ పోర్ట్స్, కీలెస్ ఎంట్రీ వంటి ఫీచర్లతో సౌకర్యవంతమైన, సుఖవంతమైన మరియు సురక్షితమైన ప్రయాణ అనుభూతిని ఈ కొత్త టాటా ఇండికా ఈ-జెటాలో పొందవచ్చు. ఇది పెట్రోల్ మరియు పెట్రోల్ + ఎల్‌పిజి వెర్షన్లలో ఇది లభ్యమవుతుంది.
ఇది బిఎస్-4 పర్యావరణ/కాలుష్య అనుమతులకు లోబడి రూపొందించబడినది. ఇంకా ఇందులో పవర్ అసిస్టెడ్ ర్యాక్ & పినియన్ హైడ్రాలిక్ స్టీరింగ్, ఫైవ్ స్పీడ్ మ్యాన్యూవల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌లతో లభించే ఈ-జెటా కారు ధర రూ. 2,97,332 నుండి రూ. 3,65,771 (ఎక్స్-షోరూమ్ ముంబై)ల మధ్య ఉండవచ్చునని అంచనా.


Click it and Unblock the Notifications








