అధిక ధర కారణంగా బంగ్లాదేశ్‌లో నానో విడుదల వాయిదా!

Tata Nano
గడచిన శనివారం బంగ్లాదేశ్ మార్కెట్లో విడుదల కావాల్సిన టాటా మోటార్స్ ప్రజల కారు టాటా నానో విడుదల వాయిదా పడింది. ఇందు ప్రధాన కారణం టాటా నానో ధరే. భారత మార్కెట్లో రూ.1.50 లక్షల రేంజ్‌లో అమ్ముడవుతున్న ఈ బుజ్జి కారు బంగ్లాదేశ్‌కు వెళ్లే సరికి మన ధరతో పోల్చుకుంటే దాదాపు మూడు రెట్లు అధికంగా ఉంది.

బంగ్లాదేశ్‌లో టాటా నానో ఖరీదు 599,000 టాకాలు (7900 డాలర్లు). బంగ్లాదేశ్‌లో టాటా మోటార్స్‌కు అధీకృత డిస్ట్రిబ్యూటర్ అయిన నిటోల్ మోటార్స్ ఈ కారును అక్కడి మార్కెట్లో తీసుకురావాలని యోచించింది. బంగ్లాదేశ్‌లో ఒక్క నానో కారు మాత్రమే కాదు వివిధ భారతీయ కార్ కంపెనీలు అందిస్తున్న ఇతర కార్ల ధరలు కూడా చాలా అధికంగానే ఉంటాయి.

బంగ్లాదేశ్‌లో దిగుమతి అధికంగా ఉండటమే ఇందుకు కారణం. బంగ్లాలో దిగుమతిదార్లు ప్రతి కారుపై 132 శాతం పన్ను చెల్లించాల్సి వుంటుంది. బంగ్లాదేశ్‌లో టాటా నానో కారు చాలా మందిని ఆకర్షించినప్పటికీ, దాని అధిక ధర కారణం కొనుగోలు చేయడానికి వారు వెనుకాడుతున్నారని నిటోల్ మోటార్స్ పేర్కొంది.

ఇదిలా ఉండగా.. ఈ చిన్న కారును తమ మార్కెట్లో విడుదల చేయాల్సిందిగా బ్రెజిల్‌లో రెండవ ముఖ్య రాష్ట్రమైన మినాస్‌ గెరాయిస్‌ గవర్నర్‌ ఆంటోనియో అగస్టో అనస్తాసియా వ్యాఖ్యానించారు. టాటా నానో కారు పట్ల బ్రెజిల్‌ వాసులు మంచి ఆసక్తిని కనబరుస్తున్నారని ఆయన చెప్పారు.

కాగా.. టాటా మోటార్స్ ఇప్పటికే తమ నానో కారును శ్రీలంక, నేపాల్ దేశాలకు కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ (సిబియూ) రూట్లో ఎగుమతి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే విధంగా మరికొద్ది రోజుల్లో మయన్మార్‌ దేశానికి కూడా టాటా నానో కారును ఎగుమతి చేయాలని, అలాగే విదేశాలకు టాటా నానోను విడి భాగాలుగా దిగుమతి చేసుకొని కంప్లీట్లీ నాక్‌డ్ డౌన్ (సికెడి) రూట్లో అసెంబ్లింగ్ చేయాలని యోచిస్తోంది.

More from DriveSpark

Article Published On: Tuesday, October 18, 2011, 12:16 [IST]
English summary
The launch of the world's cheapest car, the Tata Nano in Bangladesh has been delayed on the day of its launch after its distributor sought a price cut for the Indian small car. The Tata Nano was expected to be launched in Bangladesh on Saturday.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+