శ్రీలంకకు పయనం కానున్న టాటా మోటార్స్ చిన్నకారు 'నానో'!?

తమ ముద్దుల కారు నానోను ఎగుమతి చేస్తున్నామని గతంలో టాటా మోటార్స్ ప్రకటించినా అందుకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటనను జారీ చేయలేదు. అయితే భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (ఎస్ఐఏఎమ్) విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఏప్రిల్ 2011 నెలలో టాటా మోటార్స్ 498 నానో కార్లను ఎగుమతి చేసినట్లు ఉంది. అయితే నానో కార్లను ఏయే దేశాలకు ఎగుమతి చేశారనే అంశంపై కంపెనీ త్వరలోనే ఓ ప్రకటన విడుదల చేసే అవకాశాలున్నాయి. నానో కారును విదేశాల్లోనే ఉత్పత్తి చేసేందు కోసం ఓ ప్లాంటు ఏర్పాటు కావాల్సిన స్థలాన్ని అన్వేషిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications








