టాటా మోటార్స్ దీపావళి ధమాకా..: టాటా నానో డీజిల్!

Tata Nano
ప్రపంచంలోనే అత్యంత చౌక కారుగా రికార్డు సృష్టించి, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను సైతం ఆకట్టుకున్న టాటా మోటార్స్ ప్రజల కారు టాటా నానో ఇప్పుడు మరో అద్భుతం సృష్టించడానికి సిద్ధమవుతోంది. ఈ ఏడాది దీపావళి కానుకగా టాటా నానోలో డీజిల్ వేరియంట్‌ను కంపెనీ విడుదల చేయాలని భావిస్తోంది. మార్కెట్ స్పెక్యులేషన్స్ ప్రకారం, వచ్చే సెప్టెంబర్ నెలాఖరు నాటికి లేదా అంతకన్నా ముందుగానే 'టాటా నానో డీజిల్' మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.

పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, టాటా నానో డీజిల్ కారు ధర రూ. 1.8 లక్షల నుంచి రూ. 2.2 లక్షల మధ్య ఉండొచ్చని అంచనా. అంతేకాకుండా ఇది భారత్‌లోనే అత్యధిక మైలేజ్‌నిచ్చే కారుగా కూడా రికార్డు సృష్టించనున్నట్లు తెలుస్తోంది. అనధికారిక వర్గాల సమాచారం ప్రకారం, టాటా నానో డీజిల్‌ కారు రెండు సిలిండర్లు కలిగిన ఇంజన్‌తో లీటర్ డీజిల్ దాదాపు 40 కిలోమీటర్ల మైలేజ్‌ ఇవ్వనున్నట్లు సమాచారం.

పెట్రోల్ వేరియంట్ తయారీలో ఎదురైన సమస్యలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని టాటా మోటార్స్ తన కొత్త డీజిల్ నానో కారును అభివృద్ధి చేస్తోంది. సేఫ్టీ మరియు కంఫర్ట్ ఫీచర్ల విషయంలో పెట్రోల్ వేరియంట్ నానో కారు కన్నా డీజిల్ నానో కారు ఎంతో మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ.. ఈ విషయంపై టాటా మోటార్స్ అధికారికంగా ఓ ప్రకటన చేయాల్సి ఉంది. డీజిల్ టాటా నానో కారు గురించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం వన్ఇండియా ఆటోమొబైల్‌ను గమనిస్తూనే ఉండండి. ఆటోమొబైల్స్ గురించి ఇతర ఛానెళ్ల కన్నా వేగంగా మరియు వివరంగా సమాచారం అందించడానికి వన్ఇండియా ఆటోమొబైల్ కట్టుబడి ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Monday, August 8, 2011, 17:49 [IST]
English summary
As per the auto market speculations, Tata Motors is getting ready to launch a all new diesel variant of its People's Car Tata Nano by September end as gift of Diwali festival. However there is no official word out from Company side.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+