త్వరలో టాటా నానో డీజిల్ వేరియంట్..!?

Tata Nano
ప్రపంచంలోనే అత్యంత చవక ధరకు టాటా మోటార్స్ సంస్థ ప్రవేశపెట్టిన "ప్రజల కారు" నానో త్వరలోనే డీజిల్ వేరియంట్‌లో కూడా లభ్యం కానుంది. అయితే కొత్తగా విడుదల చేయబోయే టాటా నానో డీజిల్ అత్యంత ఇంధన సామర్థ్యం కలిగి ఉంటుందని మార్కెట్ వర్గాల సమాచారం. భారత వినియోగదారుల అవసరాలకు సరిపోయే విధంగా టాటా సంస్థ ప్రవేశపెట్టిన నానోకు ప్రజల నుంచి వస్తున్న స్పందనను, డీజిల్ వేరియంట్‌పై కనబరుస్తున్న ఆసక్తిని దృష్టిలో ఉంచుకొని కంపెనీ డీజిల్ వేరియంట్‌పై దృష్టి సారించింది.

ఒక లీటర్ డీజిల్ ఇంజన్ సామర్థ్యం కలిగిన ఇంజన్‌ను ఈ కొత్త కారులో ఉపయోగించనున్నట్లు తెలుస్తుంది. అలాగే ధర విషయంలో కూడా పెట్రోల్ వర్షన్ కన్నా డీజిల్ వర్షన్ దాదాపు రూ. 30,000 ఎక్కువగా ఉండవచ్చునని అంచనా. అయితే టాటా నానో డీజిల్ వేరియంట్ మాత్రం ఖచ్చితంగా.. టాటా మోటార్స్ అందిస్తున్న ఇతర కార్ల కన్నా కూడా అధిక మైలేజ్ ఇచ్చేవిధంగా రూపొందించేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.

More from DriveSpark

Article Published On: Monday, February 21, 2011, 15:32 [IST]
English summary
Tata Motors world' cheapest car Nano will be available soon in diesel varinat also. The Nano Diesel will surely deliver a good mileage than other diesel cars from the Tata, and new car will cost somewhere around Rs. 30,000 more than the Nano petrol variant.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+