లీటరు డీజిల్‌కు 40 కి.మీ. మైలేజ్ ఇవ్వనున్న 'నానో' డీజిల్ వేరియంట్!

Tata Nano
ఆటోమొబైల్ రంగంలో ఎప్పటికప్పుడు సరికొత్త విప్లవాలకు నాంది పలికే టాటా మోటార్స్ ఇప్పుడు మరో కొత్త ప్రయోగం చేయనుంది. టాటా మోటార్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా మరియు ప్రపంచంలోనే ఏ ఆటోమొబైల్ కంపెనీ చేపట్టిని విధంగా తొలిసారిగా అత్యంత చవక ధరకు విడుదల చేసిన నానో కారు మరో సృష్టించడానికి సిద్ధంగా ఉంది. ఇంధన ధరలు భగ్గుమంటున్న ఈ రోజుల్లో ఒక్క లీటరు డీజిల్‌తో 40 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇచ్చే డీజిల్ వేరియంట్ నానో కారు తయారీ కోసం టాటా సన్నాహాలు చేస్తుంది. అంటే మైలేజ్ విషయంలో ఓ 180సీసీ మోటార్‌సైకిల్‌ను కొనుక్కునే బదులు ఓ నానో కారును కొనుక్కోవచ్చన్నమాట.

ఇదే గనుక జరిగితే భారత్‌లోనే అత్యధిక మైలేజ్ ఇచ్చే కారుగా నానో రికార్డు సృష్టించనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే టాటా ఈ కారును విడుదల చేసే అకాశాలున్నాయి. టాటా నానో ఇంజన్‌ను అభివృద్ధి చేయడంలో తోడ్పాటందించిన ప్రముఖ విడిభాగాల సంస్థ బోష్ ఇండియా అధికారి ఒకరు మాట్లాడుతూ.. నానో పెట్రోల్ వెర్షన్‌ కోసం టాటా మోటార్స్‌తో కలిసి పనిచేశామని, అలాగే డీజిల్ వెర్షన్ కోసం కూడా పనిచేస్తున్నామని చెప్పారు. డీజిల్ వేరియంట్ నానో కారు 700 సీసీ ట్విన్-సిలిండర్ ఇంజన్‌తో మైలేజ్ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా మంచి శక్తిని విడుదల చేస్తుందని, అయితే మైలేజ్ టెస్ట్ విషయాన్ని అధికారికంగా ప్రకటించక పోయినప్పటికీ ఇది ఒక లీటరు డీజిల్‌పై 40 కిలోమీటర్లు పరుగులు తీయగలదని అంచనావేస్తున్నామని చెప్పారు.

అంటే నానో కారులో ప్రయాణం ప్రతి కిలోమీటర్‌కు ఒక్క రూపాయి మాత్రమే ఖర్చవుతుందన్నమాట. ఈ కారు ఫ్యూయెల్ ట్యాంక్ సామర్థ్యం 15 లీటర్ల వరకూ ఉండే అవకాశం ఉంది. బజాజ్ పల్సర్ 180, టీవీఎస్ అపాచీ 180 వంటి మోటార్‌సైకిళ్ల ధరలను పరిశీలిస్తే, వీటి ధరలు దాదాపు 75,000 (ఎక్స్-షోరూమ్)లకు పైమాటే. పైగా ఇవి లీటరు పెట్రోల్‌కు కేవలం 40 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తాయి. ఈ బైక్‌లపై వెచ్చించే మొత్తానికి మరికొంత నగదును కలుపుకుంటే ఓ బుజ్జి కారును సొంతం చేసుకోవచ్చు. దుమ్ము, ధూళి, ఎండా, వానల నుంచి తప్పించుకొని హాయిగా కారులో ప్రయాణించవచ్చు. పైగా బైక్‌లో ఇద్దరికి మాత్రమే చోటు, కానీ కారులో నలుగురు కూర్చొని ఎంచక్కా వెళ్లొచ్చు. మద్యతరగతి ప్రజలకు ఇది టాటా అందిస్తున్న గొప్ప కానుక.

More from DriveSpark

Article Published On: Saturday, April 30, 2011, 11:59 [IST]
English summary
Country's leading carmaker Tata Motors is planning to launch diesel variant of its small car Tata Nano, which will run 40 kilometers on a litre of diesel, matching the mileage of a typical 180cc motorcycle. It will be the most fuel-efficient car in India.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+