ప్రపంచంలోనే అత్యంత చవక ధర కారుగా ప్రపంచం దృష్టిని ఆకర్షించిన చిన్న కారు టాటా నానో ఇప్పుడు ప్రపంచ దేశాలకు తరలి వెళ్లడం ప్రారంభించింది. తమ ప్రజల కారు నానోను ఎగుమతి చేస్తున్నామని గతంలో టాటా మోటార్స్ ప్రకటించినా అందుకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటనను కంపెనీ జారీ చేయలేదు. భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (ఎస్ఐఏఎమ్) విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఏప్రిల్ 2011 నెలలో 498 నానో కార్లను టాటా మోటార్స్ ఎగుమతి చేసింది. కాగా.. 2010 ఏప్రిలో కంపెనీ కేవలం ఒక్క యూనిట్‌ను మాత్రమే ఎగుమతి చేసింది.
కానీ... టాటా మోటార్స్ మాత్రం ఈ విషయం స్పందించేందుకు నిరాకరిస్తుంది. ఏయే దేశాలకు నానో కార్లను ఎగుమతి చేశారనే అంశంపై కంపెనీ త్వరలోనే ఓ ప్రకటన చేసే అవకాశాలున్నాయి. నానో ఎగుమతుల గురించి అతి త్వరలోనే ఓ ప్రకటనను వెల్లడిస్తామని టాటా మోటార్స్ అధికార ప్రతినిధ ఒకరు వెల్లడించారు. గత నెలలో విదేశాల్లో ఓ ప్లాంటును ఏర్పాటు చేసేందుకు అత్యధిక ప్రాధాన్యతతో స్థలం కోసం వెతుకున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.