భారీగా తగ్గించిన టాటా నానో డౌన్ పేమెంట్!!

Tata Nano Gold
ప్రజల కారు టాటా నానో అమ్మకాలను పెంచుకునేందుకు కంపెనీ భారీ కసరత్తులు చేస్తోంది. వివిధ స్కీములు, డిస్కౌంట్లతో కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు టాటా మోటార్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వినాయక చవితి పండుగతో ప్రారంభం కానున్న ఫెస్టివల్ సీజన్‌ను క్యాష్ చేసుకునేందుకు టాటా నానో కారుపై రూ. 20,000 నగదు తగ్గింపును అందజేయడమే కాకుండా.. ఫైనాన్సులో కొనుగోలు చేసే వారి కోసం డౌన్ పేమెంట్‌ను కూడా భారీగా తగ్గించడం జరిగింది.

గతంలో టాటా నానో స్టాండర్డ్ వేరియంట్‌కు రూ. 35,000 లుగా ఉన్న డౌన్ పేమెంట్‌ను ప్రస్తుతం రూ. 15,000 లకు తగ్గించడం జరిగింది. మిగిలిన మొత్తన్ని సులభ వాయిదాల పద్ధతి (ఈసీ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్స్)లో చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు రాష్ట్రంలో టాటా నానో కార్లకు పెరుగుతున్న ఆదరణ పట్ల కంపెనీ ఛైర్మన్ రతన్ టాటా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలి విజయవాడ నగరాన్ని సందర్శించిన ఆయన టాటా వినియోగదారులకు స్వయంగా తాళం చెవులను అందజేశారు.

ఈ స్కీమ్ ద్వారా ఓ హై-ఎండ్ మోటార్‌సైకిల్‌ను కొనాలనుకునే కొనుగోలుదారులు సులభంగా ఈ బుజ్జి కారును సొంతం చేసుకోవచ్చు. పెరుగుతున్న వడ్డీ రేట్లు, ఇంధన ధరలతో మందగించిన అమ్మకాలకు కాస్తంత ఊతమిచ్చేందుకు కంపెనీ ఈ ఆఫర్‌ను ప్రకటించినట్లు తెలుస్తోంది. ఇది పరిమిత కాలపు ఆఫర్ మాత్రమే. ఈ డిస్కౌంట్ కారణంగా టాటా నానో కారును కొనుగోలు చేసుకున్న వినియోగదారులు పండుగ సీజన్‌ను మరింత ఆనందదాయకంగా జరుపుకోవచ్చనని కంపెనీ ప్రతినిధి ఒకరు అన్నారు.

More from DriveSpark

Article Published On: Tuesday, August 23, 2011, 16:31 [IST]
English summary
Tata Motors stung by a steep drop in its Nano small car is offering new discounts and new offers. You can now get a discount of up to Rs.20,000. Tata Motors has also reduced the down payment for the base model from Rs.35,000 to Rs.15,000. Debasis Ray, a spokesperson for Tata Motors has said these offers were only limited for a set period.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+