ప్రజాశ్రేయస్సుకు పాటుపడుతున్న టాటా నానో..!

బెంగుళూరులోని దాసరహళ్లి నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే ఎస్. మునిరాజు ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. పెరుగుతున్న జనాభాను తగ్గించేందుకు, కుటుంబ నియంత్రణ (కు.ని.) పట్ల ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఆయన ఈ స్కీమ్‌ను ప్రారంభించారు.
కాగా.. రాజస్థాన్‌లోని జున్‌జును వైద్యాధికారులు ఇప్పటికే ఈ తరహా పథకాన్ని ప్రారంభించారు. అంతేకాకుండా.. ప్రభుత్వ వైద్యశాలలో ఈ ఆపరేషన్ చేయించుకున్న వారికి రూ. 1,100 నగదును కూడా చెల్లించడం జరుగుతుంది. కాగా.. ఈ పథకానికి మరో ఇద్దరు స్థానికి ఎమ్మెల్యేలు మద్దతు తెలుపుతూ వారి తరఫు నుంచి ఐదు మోటార్‌సైకిళ్లను ఆఫర్ చేశారు.
జులై 25న లక్కీ డ్రా ద్వారా విజేతను ఎన్నుకొని నానో కారును, బహుమతులను అందజేయడం జరుగుతుంది. ఇది గనుక విజయవంతమైతే ఇలాంటి మరిన్ని నానో పథకాలను ప్రవేశపెట్టేందుకు ఎమ్మెల్యే మునిరాజు సిద్ధంగా ఉన్నారు. ఈ నానో ఐడియా ఖచ్చితంగా మంచి ఫలితాలను ఇవ్వగలదని బెంగుళూరు అర్బన్ డిస్ట్రిక్ట్ హెల్త్ ఆఫీసర్ ఎమ్ తిమ్మప్ప వెల్లడించారు. ఏదైతేనేం.. ప్రజల కారు నానో ఇలా ప్రజాశ్రేయస్సుకు పాటు పడం గర్వించదగిన విషయమే.


Click it and Unblock the Notifications








