టాటా నానో కొనుగోలుదారులలో 50% మంది తొలిసారి కొనేవారే!

టాటా నానోను విడుదల చేసినప్పుడు కొనుగోలుదారుల్లో 80 శాతం మంది తమ రెండవ కారుగా నానోను కొనుగోలు చేశారని, కానీ ప్రస్తుతం చిన్న కారు అమ్మకాల్లో దాదాపు సగం మంది తొలిసారి కారును కొనుగోలు చేసే వారు ఉండగా.. మిగిలిన వారు ఇప్పటికే వేరే ఏదో ఒక బ్రాండ్ కారును కలిగి ఉండి రెండవ కారుగా నానోను కొనుగోలు చేస్తున్నారని ఆయన చెప్పారు. తొలిసారిగా నానో కారును కొనుగోలు చేసేవారి సంఖ్య రానున్న కాలంలో 80 శాతానికి పెరవచ్చునని రామకృష్ణన్ ఆశాభావం వ్యక్తం చేశారు. టాటా నానో కార్లకు డిమాండు పెరుగుతున్న నేపథ్యంలో గుజరాత్‌లోని సనంద్ ప్లాంట్‌లో నానో కార్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచనున్నానమి ఆయన చెప్పారు.


Click it and Unblock the Notifications








