శ్రీలంకలో నానో కారుకు వ్యతిరేకంగా ఆటో డ్రైవర్ల నిరసనలు!!

Tata Nano
ప్రపంచంలోనే అత్యంత చౌక కారు, మధ్యతరగతి ప్రజలం కోసం రతన్ టాటా కన్న కల 'టాటా నానో' కారు ఉత్పత్తి ప్రక్రియలో ఆది నుంచి ఆటంకాలే. అయినప్పటికీ అన్నింటినీ అధిగమించి 2009 మార్కెట్లో అడుగుపెట్టిన ఈ బుజ్జి కారు ఎన్నో మార్కెట్ ఒడిదుడుకులను ఎదుర్కొని మొదటిసారిగా అంతర్జాతీయ మార్కెట్(శ్రీలంక)లో అడుగుపెట్టింది. అయితే శ్రీలంకలో కూడా టాటా నానో పరాభవం తప్పలేదు. టాటా నానో శ్రీలంకు రావడంతో తమ ఉపాధి దెబ్బతింటోందని వందలాదిగా డైవర్లు తమ ఆటోరిక్షాలతో శ్రీలంక రహదారులపై గంటపాటు ధర్నా నిర్వహించారు.

ఇందుకు కారణం ఏంటంటే.. శ్రీలంక కార్ మార్కెట్లోకి ప్రవేశించిన టాటా నానో ఆ వెంటనే శ్రీలంక టాక్సీ మార్కెట్లోకి అడుగుపెట్టిన ప్రైవేట్ క్యాబ్‌ల కన్నా తక్కువ ధరకే రవాణా సేవలు అందిస్తుండటంతో ఆటోలకు ఆదరణ తగ్గి ప్రజలు సౌకర్యంగా ఉండే నానో టాక్సీ సర్వీసుల వైపు మక్కువ చూపుతుండటంతో ఆటోరిక్షాలు డ్రైవర్లు ఆందోళనకు దిగారు. శ్రీలంక మార్కెట్లోకి నానోకు అనుమతివ్వకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా టాటా నానో కారు చక్రంపై ఆ దేశ అధ్యక్షుడు మహిందా రాజపక్సే చిత్రపటాన్ని అంటించి ఆటోరిక్షా డ్రైవర్లు వీధుల్లో ఊరేగించారు. నానో రాకతో వ్యాపారపరంగా నష్టపోతున్నామని ఈ సందర్భంగా ఫెడరేషన్‌ ఆఫ్‌ సెల్ఫ్‌ ఎంప్లాయిస్‌ (ఎఫ్‌ఓఎస్‌ఈ) వాదిస్తోంది. ప్రస్తుతం శ్రీలంకలో లభ్యమవుతున కార్లన్నింటిలోకెల్లా టాటా నానోనే అత్యంత చౌవకైనది. దీంతో ఎక్కువ మంది ఈ కారును టాక్సీలుగా ఉపయోగిస్తుండటంతో తమ జీవనోపాది దెబ్బ తింటోందని డ్రైవర్లు వాపోతున్నారు.

More from DriveSpark

Article Published On: Wednesday, June 22, 2011, 18:12 [IST]
English summary
The Tata Nano which is being exported to Sri Lanka is facing a new challenge at the island nation. The use of the Tata Nano as a taxi has been strongly opposed by three wheeler taxi owners in Colombo. Soon after its launch in Sri Lanka, the Tata Nano not only impressed regular buyers but also a taxi company operating in Colombo. The company launched a Tata Nano Taxi recently.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+