నేపాల్‌లో దూసుకుపోతున్న 'చీప్ కార్' టాటా నానో!

అదే మన దేశంలో అయితే టాటా నానో ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.50 లక్షల నుంచి రూ. 2 లక్షల వరకూ ఉంది. కాగా.. నేపాల్‌లో స్టాండర్డ్ వేరియంట్ నానో కారును 10,000 ఎన్‌పిఆర్‌లకే బుకింగ్ చేయగా, సిఎక్స్ వేరియంట్ 20,000 ఎన్‌పిఆర్‌లకు, ఎల్ఎక్స్ వేరియంట్ 30,000 ఎన్‌పిఆర్‌లకు బుకింగ్ చేసింది. ప్రతి నెలా 11,111 ఎన్‌పిఆర్‌లను చెల్లించే విధంగా ఈఎమ్ఐ స్కీమ్‌లో టాటా నానో కారును కొనుగోలు చేయవచ్చు. నేపాల్ కంటే ముందు శ్రీలంక మార్కెట్లోకి టాటా నానో ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో నానో కారు వల్ల తమ ఉపాధి దెబ్బతింటోందని నేపాల్ ఆటో వర్కర్ల యూనియన్లు సమ్మె కూడా చేయడం జరిగింది. కానీ, నేపాల్‌లో మాత్రం టాటా నానో ఎలాంటి చేదు అనుభవాలు ఎదురవ్వలేదు.


Click it and Unblock the Notifications








