కాల్ టాక్సీగా మారిన టాటా నానో..: స్త్రీలే క్యాబ్ డ్రైవర్లు

ఖరీదైన ఏసి కాల్ టాక్సీల్లో ప్రయాణమంటే కాస్తంత ఖర్చుతో కూడుకున్న పని కావడంతో, ప్రజలకు త్రీవీలర్ ఆటోల కన్నా సౌకర్యవంతమైన ప్రయాణాన్ని, తక్కువ ధరకే అందించేందుకు ఈ వ్యాపారాన్ని ప్రారంభించినట్లు నానో టాక్సీ కంపెనీ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. జపాన్, కొరియన్ దేశాల్లో తయరైన సెడాన్ కార్లను ఉపయోగించి ఇతర కాల్ టాక్సీ కంపెనీలు వసూలు చేస్తున్న దానిలో సగం ధరకే తాము క్యాబ్ సేవలందిస్తున్నట్లు ఆయన తెలిపారు. నానో టాక్సీ కంపెనీలో క్యాబ్‌లను డ్రైవ్ చేసేవారు స్త్రీలు కావడం ఇందులో కొసమెరుపు.


Click it and Unblock the Notifications








