అమెరికాలో 8,000 డాలర్లకే టాటా నానో..!?

Tata Nano
టాటా మోటార్స్ బజ్జి కారు ఇకపై అమెరికా మార్కెట్లో కూడా దర్శనమివ్వనుంది. అమెరికా మార్కెట్ కోసం ప్రత్యేకంగా రూపొందుతున్న టాటా నానో ధర భారత మార్కెట్లో లభ్యమవుతున్న నానోతో పోలిస్తే.. దాదాపు నాలుగు రెట్లు అధికంగా ఉంటుంది. ప్రత్యేకించి భారత వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని ప్రపంచంలోనే అత్యంత తక్కువ ధరకు విడుదల నానో కారును టాటా మోటార్స్ విడుదల చేసింది.

అయితే టాటా నానో డిజైన్ చేయాలనుకున్నప్పుడు ఆటోమొబైల్ టెక్నాలజీ అంతంమాత్రంగానే ఉండేది. కానీ నేడు లభిస్తున్న అత్యాధునికి సాంకేతిక పరిజ్ఞానంతో నానోకు మరిన్ని మెరుగులు దిద్ది అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయించాలని టాటా మోటార్స్ భావిస్తోంది. అందు దీని ధర కూడా కాస్తంత అధికంగా ఉండే అవకాశం ఉంది. అమెరికా కోసం రూపొందుతున్న టాటా నానో ప్రస్తుత భారత వెర్షన్ కన్నా ఎన్నో రెట్లు మెరుగ్గా ఉండబోతుంది. ఫీచర్స్, ప్రత్యేకతలు, ప్రైస్ ట్యాగ్ ఇలా ఎన్నో విషయాల్లో చాలా మార్పులు ఉండనున్నాయి.

ఇటీవల వరుస అగ్ని ప్రమాదాలతో వార్తల్లోకెక్కడంతో.. అమెరికా మార్కెట్ కోసం ప్రత్యేకించి సేఫ్టీ మెజర్‌మెంట్స్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించనుంది. అయితే అమెరికా మార్కెట్ కోసం ప్రత్యేకంగా తయారు చేసే చిన్నకారు తయారీకి టాటా మోటార్స్ నానో ఫ్లాట్‌ఫామ్‌ ఉపయోగిస్తుందా.. లేక ప్రత్యేకించి ఓ సరికొత్త ఫ్లాట్‌ఫామ్‌‌ను డిజైన్ చేయనుందా అనే విషయం ఖచ్చితంగా తెలియాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ యూస్ వేరియంట్ నానోను ప్రస్తుత ధరల ప్రకారం అందించలేమని టాటా మోటార్స్ అధినేత రతన్ టాటా ఓ అమెరికన్ టెలివిజన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. అమెరికాలో నానో దాదాపు 7,000 డాలర్లు లేదా 8,000 డాలర్లు ఉండే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Thursday, March 17, 2011, 17:55 [IST]
English summary
Tata Motors small car Tata Nano US variant will cost almost four-fold than the Indian Nano.Instead of the People’s Car hitting Uncle Sam country, Tata plans to develop an all new model for the American market at a price of $7,000 to $8,000.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+