మారుతి ఎమ్800 వర్సెస్ టాటా నానో: ఏ కారు బెస్ట్..!?

ఇంజన్ మరియు ప్రత్యేకతలు
మారుతి 800 ఇంజన్‌ను గమనిస్తే ఇది 37 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని విడుదల చేస్తుంది, మరి వండర్ కార్ టాటా నానో విషయానికి వస్తే.. ఇది 33 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని విడుదల చేస్తుంది. పవర్ సంగతి అలా ఉంచి ఈ రెండు కార్ల బరువులను పరిశీలిస్తే.. నానో కారు బరువు 580 కేజీలు, మారుతి 800 బరువు 660 కేజీలు. అలాగే పిటిడబ్ల్యూ (పవర్ టూ వైయిట్ రేషియో)ను గమనించినట్లయితే నానో 0.057 bhp/kg, మారుతి 800 0.056 bhp/kg. కాబట్టి దీన్ని బట్టి చూస్తే.. దాదాపు సగం ధరకే మారుతి కారు ఇచ్చే శక్తిని నానో కారులో పొందవచ్చని తెలుస్తుంది.
పెర్ఫామెన్స్
ఈ రెండు బుజ్జి కార్లలో ఇది అత్యంత ప్రధానమైన అంశం. రెండు కార్లు కూడా అద్భుతమైన పెర్ఫామెన్స్‌ను కలిగి ఉన్నప్పటికీ.. ఈ విషయంలో మారుతి 800పై నానో కారుదే పైచేయి. టాటా నానో దాదాపు లీటరు పెట్రోలుకు 20 కి.మీ. మైలేజ్‌ను ఇస్తుండగా.. మారుతి 800 కారు సగటున 15 నుంచి 18 కి.మీ. మైలేజ్‌ను ఇస్తుంది. మారుతి 800 కన్నా నానో ఎక్కువగా మైలేజ్ ఇవ్వడానికి దాని తక్కువ ఇంజన్ సామర్థ్యమం కూడా ఒక కారణం, అయినా ఇది వేగం విషయంలో దాదాపు అధిక ఇంజన్ కలిగిన కార్ల మాదిరిగానే ప్రయాణిస్తుంది. ఇంకా ఈ కారును యూరో5 పరిమితులను దృష్టిలో ఉంచుకొని రూపొందించారు. ఇది ఇంధన సామర్థ్యానికి పెంచేందుకు తోడ్పడుతాయి.
ఫీచర్స్
ఈ రెండు కార్లు కూడా ప్రారంభ మోడల్స్ కావడంతో వీటిలో ఆధునిక ఫీచర్లను ఎక్స్‌పెక్ట్ చేయలేము. నానో ఇంటీరియర్ స్పేస్ విషయానికి వస్తే.. అధిక లెగ్‌రూమ్‌తో ఆరు అడుగులు పొడవున్న వ్యక్తి కూడా సౌకర్యంగా కూర్చొని డ్రైవ్ చేయవచ్చు. కానీ మారుతి 800లో మాత్రం స్థలం తక్కువగా ఉంటుంది. అలాగే నానో డ్యాష్‌బోర్డును చూసినట్లయితే.. మారుతి 800 డ్యాష్‌బోర్డు కన్నా ఎంతో స్టైలిష్‌గా ఉంటుంది.
లుకింగ్
ఇక లుక్స్ విషయానికి వస్తే.. మారుతి 800 ఎక్స్‌టీరియర్స్‌తో పోలిస్తే నానో ఎక్స్‌టీరియర్స్ ఎంతో ట్రెండీగా ఆకర్షనీయమై రంగుల్లో లభిస్తుంది. కానీ కొందరి అభిప్రాయం ప్రకారం.. ఇది చూడటానికి ఓ ఫోర్‌వీలర్ ఆటో లేదా వ్యాన్‌లా ఉందని మారుతి 800ను ఆశ్రయిస్తన్నారు. మారుతి 800 వాస్తవ కారులా దర్శనమివ్వడమే ఇందుకు కారణం.
సేఫ్టీ
హమ్... కార్లలో అన్నింటి కన్నా ముఖ్యమైన అంశం ఇది. సేఫ్టీ విషయంలో నానో కారుపై కొన్ని అపోహలు వచ్చినా.. మారుతి 800తో పోలిస్తే సేఫ్టీ నానో కారే టాప్. స్ట్రాంగ్ ప్యాసింజర్ కంపార్ట్‌మెంట్, క్రంపల్ జోన్స్, ఇంట్రుజన్ రెసిస్టెంట్ డోర్స్, సీట్ బెల్ట్స్, స్ట్రాంగ్ సీట్స్ వంటి సేఫ్టీ ఫీచర్స్ నానో కారు సొంతం. మారుతి 800లో సేఫ్టీ ఫీచర్స్ తక్కువ. ఇందులో సైడ్ ఇంపాక్ట్ బీమ్స్, ల్యామినేటెడ్ విండ్‌షీల్డ్, అడిషనల్ బాడీ రీఇన్‌ఫోర్స్‌మెంట్ వంటివి మాత్రమే ఉన్నాయి.
ధర
ఈ కార్ల ధరల గురించి అందరికీ తెలిసిన విషయమే.. టాటా నానో కారు రూ. 1.15 లక్షల నుంచి రూ. 1.92 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)ల మధ్య లభిస్తుండగా.. మారుతి 800 కారు ఇంచు మించి నానో ధరతోనే అంటే.. రూ. 1.95 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)తో లభిస్తుంది. కానీ ప్రస్తుతం ఈ కారును పర్యావరణ అనుమతుల దృష్ట్యా కొన్ని మెట్రో నగరాల్లో నిషేధించారు.
మరి ఇప్పుడు మీరు చెప్పండి ఈ రెండు కార్లలో ఏది బెస్టో...!


Click it and Unblock the Notifications








