ప్రపంచంలోనే అత్యంత చవక కారైన టాటా నానో యూరప్ మార్కెట్లో ప్రవేశించడానికి మరో రెండు మూడేళ్ల సమయం పట్టవచ్చునని కంపెనీ పేర్కొంది. యూరప్‌లో 2013 ఆరంభంలో టాటా నానో విక్రయాలు ప్రారంభమవుతాయని టాటా మోటార్స్ చీఫ్ కార్ల్ పీటర్ ఫ్రోస్టర్ తెలిపారు. ప్రముఖ జర్మనీ దినపత్రిక 'ఫ్రాంక్‌ఫర్ట్ రుండ్‌స్చావ్'కు ఫ్రోస్టర్ ఇచ్చిన ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఖచ్చితంగా నానోను యూరప్‌లో ఎప్పుడు విడుదలవుతుందన్న విషయం చెప్పలేమని, కానీ ఇందుకు మరో రెండేళ్ల సమయం పడుతుందని ఆయన స్పష్టం చేశారు.
ఫిబ్రవరి, 2011లో టాటా నానో విక్రయాలు రెట్టింపయ్యి 8,262 యూనిట్లకు పెరిగిన సంగతి తెలిసిందే. కాగా.. జెనీవాలో జరుగుతున్న 81 అంతర్జాతీయ మోటార్ షోలో టాటా మోటార్స్ యూరప్ మార్కెట్ల కోసం ప్రత్యేకంగా నానో ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా రూపొందించిన పిక్సెల్ కారును ప్రదర్శించిన సంగతి తెలిసిందే. మరి నానో ముందుగా నానో ముందుగా మార్కెట్లోకి వెళ్తుందా.. లేక పిక్సెల్ వెళ్తుందా అనే విషయాన్ని మాత్రం ఆయన ప్రస్తావించలేదు.