టాటా నానో కారుపై రూ. 20,000 వరకూ డిస్కౌంట్స్!

టాటా నానో కారును తొలుత 2009లో పరిచయం చేసినప్పుడు అప్పటి మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఈ కారు ధరను లక్ష రూపాయాలుగా కంపెనీ నిర్ణయించింది. అయితే.. పశ్చిమ బెంగాల్‌లో ఉన్న టాటా నానో ప్లాంటుకు సింగూర్ ప్రజల నుంచి ఎదురైన తిరుగుబాటు ఫలితంగా కంపెనీ కొంత పెట్టుబడులను నష్టపోవడం మరీ ముఖ్యంగా ఇటీవల కాలంలో ఆకాశాన్ని తాకుతున్న ముడిసరుకుల ధరల కారణంగా లక్ష రూపాయల కారు కాస్తా.. లక్షన్నర రూపాయల కారుగా మారింది.
కాగా.. ప్రస్తుతం మందగిస్తున్న కంపెనీ వృద్ధి రేటును నిలబెట్టుకునేందుకు మరియు చిన్న కార్ల విభాగంలో గట్టి పోటీ ఇచ్చేందుకు టాటా నానోపై కంపెనీ ఈ డిస్కౌంట్లను ఆఫర్ చేయనుంది. టాటా నానో స్టాండర్డ్ వేరియంట్‌పై రూ. 15,000 డిస్కౌంట్‌ను, నానో ఎల్ఎక్స్ మరియు నానో సిఎక్స్ వేరియంట్లపై రూ. 20,000 డిస్కౌంట్‌ను కంపెనీ అందించనుంది.


Click it and Unblock the Notifications








