బిగ్ బజార్ రీటైల్ షోరూమ్‌లలో టాటా నానో విక్రయాలు

రీటైల్ వ్యాపారంలో అగ్రగామిగా ఉన్న "బిగ్ బజార్" (ఫ్యూచర్ గ్రూప్ సంస్థ) ఇకపై నానో కార్లను కూడా తమ సూపర్ మార్కెట్లలో విక్రయించనుంది. దేశవ్యాప్తంగా అన్ని రీటైల్ దుకాణాల్లో ఈ కారును విక్రయించేందుకు గల సాధ్యాసాధ్యాలను ఫ్యూచర్ గ్రూప్ పరిశీలిస్తోంది. ఓ రీటైల్ కంపెనీ ఇలా కార్లను విక్రయించడం దేశంలో ఇదే మొట్టమొదటిసారి. ఇప్పటికే బిగ్ బజార్ 450కు పైగా నానో కార్లను విక్రయించినట్లు పరిశ్రమ వర్గాల సమాచారం. గత ఫిబ్రవరి విక్రయాలతో పోల్చి చూస్తే ఇది 5 శాతం అధికం. అంటే ఇకపై బిగ్ బజార్ రీటైల్ షోరూమ్‌లలో ఉప్పు, పప్పులతో పాటు నానో కారును కూడా కొనుక్కోవచ్చన్నమాట.


Click it and Unblock the Notifications








